Site icon HashtagU Telugu

Nizamabad : మహిళ నుండి డబ్బులు తీసుకొని టికెట్ ఇచ్చిన బస్సు కండక్టర్..

Bus Tiket Women

Bus Tiket Women

తెలంగాణ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్..రెండు రోజుల్లోనే రెండు కీలక హామీలను ప్రవేశ పెట్టి ప్రజల్లో సంతోషం నింపారు. ముఖ్యంగా మహిళకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం ఫై రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ..సీఎం రేవంత్ కు థాంక్స్ చెప్పుకుంటున్నారు. నిన్నటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఫ్రీ ప్రయాణం కొనసాగుతున్న వేళ..నిజామాబాద్ లో ఓ బస్సు కండక్టర్ మహిళా నుండి డబ్బులు తీసుకొని టికెట్ ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

We’re now on WhatsApp. Click to Join.

ఏపీ 25జెడ్ 0062 నెంబరు గల బస్సు నిజామాబాద్ నుంచి బోధన్ వెళ్తుండగా ముగ్గురు మహిళలు నిజామాబాద్ నుంచి బోధన్ వెళ్లేందుకు బస్సు ఎక్కారు. ముగ్గురు మహిళల దగ్గర బస్సు టికెట్ కోసం డబ్బులు వసూలు చేశాడు కండక్టర్.

రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు బస్పుల్లో ఉచిత ప్రయాణం ప్రకటించిందికదా..ఎందుకు ఛార్జీలు వసూలు చేస్తున్నారని మహిళలు ప్రశ్నిస్తే..అలాగే వసూలు చేస్తా..అంటూ కండక్టర్ ఎదురు సమాధానం చెప్పాడు. దీంతో షాక్ ఐన మహిళలు బంధువుల సాయంతో వీడియో రికార్డు చేసి నిజామాబాద్ డిపో మేనేజరుకు ఫిర్యాదు చేసారు.

ఈ విషయంపై స్పందించిన నిజామాబాద్ డిపో మేనేజర్.. మా డిపోనుంచి అన్ని పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం.. అయితే మహిళల నుంచి డబ్బులు వసూలు చేసిన కండక్టర్ పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబదించిన వీడియో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

Read Also :