Bull Nuisance: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వింత ఘటన.. ఎద్దు మూత్ర విసర్జన చేసిందని జరిమానా..!

ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు పట్టణంలో ఓ రైతుకు వింత అనుభవం ఎదురైంది.

  • Written By:
  • Updated On - December 6, 2022 / 12:34 PM IST

ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు పట్టణంలో ఓ రైతుకు వింత అనుభవం ఎదురైంది. ఇల్లందు పట్టణంలోని నెంబర్ టు బస్తీలో నివసించే సుందర్ లాల్ స్థానికంగా ఉంటూ ఎద్దుల బండిలో కిరాయికి తోలుకుంటూ జీవనం కొనసాగిస్తుంటాడు. ఎద్దుల బండితో పరిసర ప్రాంతాల్లోని మట్టి, ఇసుకలను తోలుకుంటూ నాలుగు పైసలతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో స్థానిక సింగరేణి జిఎం కార్యాలయం ముందు నుండి మట్టి తీసుకొని వచ్చేందుకు వెళుతున్న క్రమంలో కార్యాలయం ముందు ఎద్దు ఆగి మూత్రం పోసిందని సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారని సుందర్ లాల్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే సుందర్ లాల్ ను స్థానిక పోలీసులు పిలిపించి జిఎం కార్యాలయం ముందు ఎద్దు మూత్రం పోసినందుకు ఫిర్యాదు అందిందని అందుకు కేసు నమోదు చేసి కోర్టుకు పంపిస్తామని అన్నారు.

పోలీసుల పిలుపుతో కంగుతున్న సుందర్ లాల్ ఆశ్చర్యానికి గురయ్యాడు. ఎద్దు మూత్రం పోస్తే కేసు పెట్టడం ఏంటి అని అడిగాడు. దీంతో కేసు నమోదయిందని కోర్టుకి పోయి ఫైన్ చెల్లించ మనీ చెప్పారని, చెల్లించకపోతే జైలుకు పోవాల్సి వస్తుందని అన్నారని సుందర్ లాల్ ఆవేదనతో చెప్పారు. కిరాయికి తోలుకొని జీవించే నాకు ఎద్దులను పోషించే కష్టమవుతున్న తరుణంలో మూత్రం పోసినందుకు ఫైన్ కట్టడం ఏంటి అని పోలీసుల ఎదుట బాధపడుతుండడంతో స్థానిక కోర్టు పోలీస్ కానిస్టేబుల్ స్పందించి స్థానిక ఇల్లందు మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టులో అతనికి ఫైన్ చెల్లించి రసీదు ఇవ్వడం జరిగింది. పోలీసులు సహాయం చేశారని సింగరేణి అధికారులు మాత్రం కేసు పెట్టి ఆందోళన గురి చేశారని అన్నారు. ఏది ఏమైనా ఎద్దు మూత్రం పోసినందుకు కేసు పెట్టి ఫైన్ విధించడం చర్చనీయాంశమైంది.

గత నెల 29న 21 ఏరియా నుంచి తన బండి తీసుకుపోతున్నాడు. 24 ఏరియాలో సింగరేణి జీఎం ఇల్లు ఉంటుంది. దాని ముందు నుంచి వెళ్తూ ఎద్దు మూత్రం పోసింది. వెంటనే సింగరేణి గార్డులు ఫిర్యాదు చేశారు. నీ ఎద్దు చేసిన నేరానికి నీ మీద సెక్షన్ 290 (న్యూసెన్స్) పెడుతున్నాం అన్నారు. శాంతిభద్రతలు, ఉన్నతాధికారుల గౌరవప్రపత్తులపై ఏమాత్రం రాజీపడని పోలీసులు కేసు పెట్టారు. జడ్జి ముందు ప్రవేశపెట్టారు. జడ్జి 100 రూపాయల జరిమానా వేశాడు. అవీ చెల్లించే డబ్బు లేకపోవడంతో చివరకు ఓ కోర్టు కానిస్టేబుల్ తన జేబు నుంచి ఆ వంద కట్టి విడిపించేశాడు. ఏది ఏమైనా ఎద్దు మూత్రం పోసినందుకు కేసు పెట్టి ఫైన్ విధించడం జిల్లాలోనే చర్చనీయాంశమైంది.