Munugode Elections : బీఎస్పీ కింగ్ మేక‌ర్! స‌ర్వేల్లో మునుగోడు వి`చిత్రం`!

మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో బీఎస్పీ ప్రధాన పార్టీల‌ గెలుపోట‌ములను నిర్దేశించ‌నుంది. ఆ పార్టీకి ఎస్సీ ఓట‌ర్లు 15శాతం వ‌ర‌కు మ‌ద్ధ‌తు ఉంద‌ని తాజా స‌ర్వేల సారాంశం.

  • Written By:
  • Updated On - October 14, 2022 / 02:30 PM IST

మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో బీఎస్పీ ప్రధాన పార్టీల‌ గెలుపోట‌ములను నిర్దేశించ‌నుంది. ఆ పార్టీకి ఎస్సీ ఓట‌ర్లు 15శాతం వ‌ర‌కు మ‌ద్ధ‌తు ఉంద‌ని తాజా స‌ర్వేల సారాంశం. తెలంగాణ బీఎస్పీ క‌న్వీన‌ర్ గా డాక్ట‌ర్ ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత తొలిసారి ఆ పార్టీ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగింది. ఆ పార్టీ అభ్య‌ర్థిగా అందోజు శంకరా చారి నామినేష‌న్ వేశారు. ఆయ‌న‌కు అండ‌గా ప్ర‌వీణ్ కుమార్ క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి బీఎస్పీ అభ్య‌ర్థికి ఓటేయాల‌ని అభ్యర్థిస్తున్నారు. ఫ‌లితంగా ఎస్సీ ఓటు బ్యాంకులో 15శాతం వ‌ర‌కు ఆ పార్టీ పొంద‌నుందని స‌ర్వే సంస్థ‌లు అంచ‌నా వేయ‌డం గ‌మ‌నార్హం.

మ‌నుగోడులో బీసీ, ఎస్సీ వ‌ర్గానికి చెందిన ఓట‌ర్లు ఎక్కువ‌గా ఉన్నారు. ప‌ద్మ‌శాలి, ముదిరాజ్‌, గౌడ‌, కురువ‌, యాద‌వ్ త‌దిత‌ర సామాజిక‌వ‌ర్గాల ప్ర‌జ‌లు ఎక్కువ‌. కానీ, ప్ర‌ధాన పార్టీలు `రెడ్డి` సామాజిక‌వ‌ర్గం అభ్య‌ర్థుల‌ను బ‌రిలోకి దింపాయి. దీంతో బీసీ, ఎస్సీ ఓట‌ర్ల సామాజిక వ‌ర్గాల‌కు అతీతంగా ఓట్లు వేసే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం స‌ర్వే సంస్థ‌లు అంచ‌నా వేస్తోన్న ప్ర‌కారం ఇరిగేష‌న్ ప్రాజెక్టుల రూపంలో భూములు కోల్పోయిన ఓట‌ర్లు మాత్ర‌మే కాంగ్రెస్ వైపు ఎక్కువ‌గా ఉన్నారు. ఆ త‌రువాత మ‌హిళ‌లు మిగిలిన పార్టీల కంటే కాంగ్రెస్ ను ఇష్ట‌ప‌డుతున్నార‌ట‌. ఎస్సీల్లోని ఓట‌ర్ల‌లో ఎక్కువ భాగం కాంగ్రెస్ కు ఉన్న‌ప్ప‌టికీ ఆ ఓటు బ్యాంకును బీఎస్పీ భారీగా చీల్చ‌నుంది.

రైతులు, పెన్ష‌న్లు తీసుకుంటోన్న వృద్ధులు ఎక్కువ‌గా టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపుతున్నార‌ని స‌ర్వే సంస్థ‌ల అంచ‌నా. సామాజిక‌వ‌ర్గం ప‌రంగా గౌడ్ లు ఎక్కువ‌గా టీఆర్ఎస్ కు మ‌ద్ధ‌తుగా ఉన్నారు. అదే ముదిరాజ్ లు బీజేపీ వైపు ఆక‌ర్షితుల‌య్యార‌ని స‌ర్వేల సారాంశం. అంతేకాదు, ప్ర‌ధానంగా యూత్ బీజేపీ వైపు సాలిడ్ గా ఉంద‌ని స‌ర్వేల అంచ‌నా. పార్టీల వారీగా యూత్ ఓటు బ్యాంకును తీసుకుంటే బీజేపీకి 40శాతం షేర్ ఉంది. అదే టీఆర్ఎస్ కు 35శాతం, కేవ‌లం 20శాతం కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంద‌ని ప్ర‌ముఖ ఎస్ఏఎస్ స‌ర్వే సంస్థ తేల్చింది.

ప‌ద్మ‌శాలి, చేనేత వ‌ర్గాలు సాలిడ్ గా బీజేపీకి అనుకూలంగా ఉన్నాయ‌ని స‌ర్వేల సారాంశం. మహిళలకు సంబంధించి INC, TRS మరియు BJP మధ్య 45:35:17 నిష్పత్తిలో ఓట్ల షేరింగ్ ఉంటుంద‌ని అంచ‌నా. ఇక రైతులు, వృద్ధుల విభాగంలో 50:30: 15 నిష్పత్తిలో వ‌ర‌సగా TRS, INC, BJP పార్టీల‌కు ఓటు షేరింగ్ ఉంద‌ని స‌ర్వేల్లో తేలింది. గౌడ సామాజికవర్గంలో దాదాపు 60 శాతం మంది టీఆర్‌ఎస్‌కు అనుకూలంగానూ ముదిరాజ్ బీజేపీకి అనుకూలంగా ఉంది. ఓటింగ్ వరుసగా BJP,TRS, Inc మధ్య 50:30:15 నిష్పత్తిలో ఆ సామాజిక‌వ‌ర్గంకు విభజించబడింది. Sc కమ్యూనిటీ ఓటింగ్ INCకి అనుకూలంగా ఉంది bsp కూడా 15 శాతం sc ఓటింగ్‌ను పొంద‌నుంది. యూత్ ఓటింగ్ ప్రధాన పార్టీలైన TRS,BJP,Inc మధ్య 35:40:20 నిష్పత్తిలో ఉంద‌ని ఆత్మ‌సాక్షి స‌ర్వే సంస్థ అంచ‌నా వేసింది.

మొత్తంగా బీఎస్పీ కార‌ణంగా మూడో ప్లేస్ కు కాంగ్రెస్ వెళ్ల‌నుందని అంచ‌నా. నువ్వా? నేనా? అంటూ బీజేపీ, టీఆర్ఎస్ మ‌ధ్య మునుగోడు పోరు ఉంది. యూత్ బీజేపీ వైపు చాలా వేగంగా మొగ్గు చూపుతోంది. మ‌హిళ‌లు, రైతుల‌ను యూత్ ప్ర‌భావితం చేయ‌గ‌లిగితే బీజేపీ గెలుపు ఖాయంగా క‌నిపిస్తోంది. లేదంటే, టీఆర్ఎస్ పార్టీకి ప్ర‌స్తుతానికి ఎడ్జి క‌నిపిస్తోంద‌ట‌. అయితే, నానాటికీ టీఆర్ఎస్ ఓటు బ్యాంకు జారిపోతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. పోలింగ్ నాటికి ఎంత ఓటు బ్యాంకును గులాబీ పార్టీ నిలుపుకుంటుంది? అనే దానిపై ఆ పార్టీ గెలుపుఓట‌ములు ఆధార‌ప‌డ్డాయ‌ని స‌ర్వే సంస్థ‌ల అంచ‌నా. మొత్తంగా కాంగ్రెస్ పార్టీని బీఎస్పీ దెబ్బ కొట్ట‌బోతుంద‌ని మాత్రం స్ప‌ష్టం అవుతోంది.