Site icon HashtagU Telugu

RS Praveen Kumar : సిర్పూర్ నుంచి పోటీ చేస్తా.. క్లారిటీ ఇచ్చిన ప్ర‌వీణ్ కుమార్‌

R.s. Praveen Kumar

R.s. Praveen Kumar

కోమ‌రంభీం జిల్లా (Komarambhim District) లోని కాగ‌జ్‌న‌గ‌ర్‌లో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు బీఎస్పీ (BSP) కార్య‌క్ర‌మంలో ఆ పార్టీ తెలంగాణ అధ్య‌క్షులు ఆర్‌.ఎస్‌. ప్ర‌వీణ్ కుమార్ (R.S. Praveen Kumar) పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సిర్పూర్ నియోజకవర్గం (Sirpur Constituency) నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా క్లారిటీ ఇచ్చారు. సిర్పూర్ నుండి పోటీచేసి ఇక్కడ ప్రాంత ప్రజలందరికి విముక్తి కల్పిస్తాన‌ని అన్నారు. ఆంధ్ర నుండి తెలంగాణ విడిపోయినా.. సిర్పూర్ నియోజకవర్గంలో మాత్రం ఇంకా ఆంధ్ర పాలకులు రాజ్యం ఏలుతున్నారని ప్ర‌వీణ్ కుమార్ విమ‌ర్శించారు. సిర్పూర్ ప్రాంతాన్ని దోచుకోవడంకోసం స్థానిక ఎమ్మెల్యే కుటుంబం ఇక్కడ స్థిరపడ్డారని ఆరోపించారు. కాగజ్‌నగర్ మండ‌లం అందవెల్లి వద్ద బ్రిడ్జ్ కూలిపోయిన వ్యవహారం పూర్తిగా ఎమ్మెల్యే దే బాధ్యత ప్ర‌వీణ్ కుమార్ అన్నారు.

సిర్పూర్ పేపర్ మిల్లులో ఇతర ప్రాంతం వారిని తీసుకొచ్చి స్థానిక కార్మికులకు అన్యాయం చేశార‌ని ప్ర‌వీణ్ కుమార్ ఆరోపించారు. దళిత బంధును బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చారని విమ‌ర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే సిర్పూర్ లో గౌతమ బుద్ధుడు విగ్రహం, హైదరాబాద్‌లో అంబేద్కర్ విగ్రహాలు పెట్టారని అన్నారు. పోడు భూములకు పట్టాలు పారదర్శకంగా ఇవ్వాలని, అర్హత ఉన్న నాలుగు లక్షల గిరిజనులకు పోడు పట్టాలు ఇవ్వాలని ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్ డిమాండ్ చేశారు. యూనిఫాం సివిల్ కోడ్ మత విద్వేశాలను రెచ్చగొట్టే విధంగా ఉందని అన్నారు.

దేశంలో, రాష్ట్రంలో బీజేపీని తన్ని తరిమెయ్యాలని బీఎస్పీ తెలంగాణ అధ్య‌క్షుడు ప్ర‌వీణ్ కుమార్ పిలుపునిచ్చారు. మధ్యప్రదేశ్ లో ఓ ఆదివాసీ వ్యక్తిపై మూత్రం పోసాక.. సీఎం అతని కాళ్ళు కడగడం విడ్డురంగా ఉంద‌ని అన్నారు. మాలీలకు ఎస్టీ హోదా కల్పిస్తామని కేసిఆర్ మాయమాటలు చెప్తున్నారని, బీఎస్పి అధికారంలోకి వస్తే మాలీలను ఎస్టీ జాబితాలో చేర్చుతామ‌ని హామీ ఇచ్చారు. సిర్పూర్ నుంచి వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నేను పోటీ చేస్తాన‌ని, సిర్పూర్ లో బీఎస్పీ గెలవబోతుందని ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ధీమా వ్య‌క్తం చేశారు.

YS Sharmila: తెలంగాణ గ‌డ్డ‌పైనే ష‌ర్మిల రాజ‌కీయం.. క్లారిటీ ఇచ్చిన వైఎస్ఆర్‌ బిడ్డ‌!

Exit mobile version