Site icon HashtagU Telugu

BSP – BRS Alliance : కేసీఆర్‌తో ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ కుమార్ భేటీ..పొత్తు కు సిద్ధమా..?

Bsp Brs

Bsp Brs

లోక్ సభ (Lok Sabha) ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ (KCR)తో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ (RS Praveen Kumar) భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్‌ నంది నగర్‌లోని కేసీఆర్‌ నివాసంలో దాదాపు గంటకు పైగా వీరు సమావేశమయ్యారు. ఈ భేటీలో బీఎస్పీ పార్టీ ప్రతినిధుల బృందం కూడా ఉంది.

ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ నేతలు హరీష్ రావు, బాల్క సుమన్ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం సమావేశం కొనసాగుతుంది. రెండు పార్టీల పొత్తులపై నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. పొత్తు కుదిరితే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసే పోటీ చేసే అవకాశం ఉంది. కాగా డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అధికారం కోల్పోగా.. సిర్పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీలోకి దిగిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓటమి చెందారు. ఏకంగా మూడో స్థానానికి పరిమితం అయ్యారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ నేపథ్యంలో రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదని భావించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. రాష్ట్రంలో అధికారం కోల్పోయినా బీఆర్ఎస్ పార్టీతో (BRS Party) పొత్తు పెట్టుకుంటే కనీసం పార్లమెంట్ ఇద్దరు ఎంపీలనైనా పంపవచ్చు అని భావిస్తున్నారట. ఈ క్రమంలో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే నాగర్ కర్నూల్ నుంచి ఎంపీ గా పోటీ చేయాలనీ ప్రవీణ్ కుమార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి ఓకే అనుకుంటే రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పొత్తుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. దీనిపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది.

Read Also : Khammam: ఖమ్మంలో నామా చరిత్ర సృష్టిస్తాడా? కేసీఆర్ నమ్మకం నిలబెట్టేనా..