Hyderabad : హత్య చేసి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేసిన యువకులు

హైదరాబాద్ లో కొంతమంది యువకులు..యువకుడ్ని చంపి, దానిని రీల్స్ చేస్తూ ఆ వీడియో పోస్ట్ చేసారు

Published By: HashtagU Telugu Desk
Hyd Murder Reels

Hyd Murder Reels

సోషల్ మీడియా (Social Media) లో రాత్రికి రాత్రే పాపులర్ కావాలని దారుణాలకు ఒడిగడుతున్నారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా వాడకం బాగా పెరిగింది. ఉదయం లేచిన దగ్గరి నుండి పడుకునే వరకు ప్రతిఒక్కరు ప్రతి క్షణం సోషల్ మీడియా తోనే గడిపేస్తున్నారు. రీల్స్ అని , యూట్యూబ్ వీడియోస్ అని , ఫ్రాంక్ వీడియోస్, కామెడీ వీడియోస్ ఇలా అనేక రకాలైన వీడియోస్ చేస్తూ సోషల్ మీడియా లో గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నారు. అదే విధంగా సోషల్ మీడియా ద్వారా కూడా డబ్బు వస్తుండడం తో చాలామంది ఇదే పనిగా చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో కొంతమంది యువకులు..యువకుడ్ని చంపి, దానిని రీల్స్ చేస్తూ ఆ వీడియో పోస్ట్ చేసారు. ప్రస్తుతం ఈ వీడియో అందర్నీ భయబ్రాంతులకు గురి చేస్తుంది.

ఫుల్ స్టోరీ లోకి వెళ్తే..

We’re now on WhatsApp. Click to Join.

జీడిమెట్లలోని బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో దారణం జరిగింది. ప్రగతినగర్ బతుకమ్మ కుంట కు చెందిన సిద్దు అనే యువకుడిని ఇంటి నుంచి అర్థారాత్రి బలవంతంగా బయటకు తీసుకొచ్చిన కొందరు యువకులు..అతి దారుణంగా అతడ్ని హత్య చేసారు. సిద్దు పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. హత్య కేసుల్లో ఇరుక్కొని రెండు నెలల క్రితమే జైలుకు వెళ్లి వచ్చాడు. ఇంతలోగా అతడి ఫై ఎప్పటి నుండో పగతో ఉన్న కొంతమంది యువకులు అతి దారుణంగా పొడిచి చంపేశారు.

అనంతరం రక్తం తడిసిన చేతులు, పొడిచిన కత్తితో ఇన్‌స్టా రీల్స్ చేశారు. ప్రత్యర్థులకు హెచ్చరికలు చేస్తూ… తమ జోలికి వస్తే ప్రాణాలు ఉండబోవని వార్నింగ్ ఇస్తూ రక్తంతో తడిసిన చేతులు, చేతిలో ఉన్న చాకు చూపిస్తూ రీల్స్ చేశారు. ఈ వీడియో చూసి అంత భయబ్రాంతులకు గురి చేస్తుంది.

Read Also : Work In Bank: మీకు బ్యాంకులో ప‌ని ఉందా..? అయితే ఈ వార్త మీ కోస‌మే..!

  Last Updated: 08 Apr 2024, 11:19 AM IST