BRS Manifesto: బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోకు విలువ లేదు

కేసీఆర్ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోపై సెటైర్లు పేలుతున్నాయి. కాంగ్రెస్ మేనిఫెస్టోని కాపీ కొట్టారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. తాజాగా బీజేపీ ఎన్నికల ఇంచార్జ్, మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్ బీఆర్ఎస్ మేనిఫెస్టోపై విమర్శలు గుప్పించారు.

BRS Manifesto: కేసీఆర్ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోపై సెటైర్లు పేలుతున్నాయి. కాంగ్రెస్ మేనిఫెస్టోని కాపీ కొట్టారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. తాజాగా బీజేపీ ఎన్నికల ఇంచార్జ్, మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్ బీఆర్ఎస్ మేనిఫెస్టోపై విమర్శలు గుప్పించారు.

తెలంగాణలో రానున్న ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించాయి. దీంతో పాటు ఎన్నికల హామీలను ప్రకటిస్తున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. అయితే అధికార పార్టీ ఎన్నికల హామీలపై జవదేకర్ స్పందిస్తూ.. బిఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో పూర్తిగా విలువలేనిది. రాష్ట్రంలోని దళితులందరికీ రూ.10 లక్షలు ఇస్తామని చెప్పిన పార్టీ ఇప్పటి వరకు అధికార పార్టీ నేతలకు 30 శాతం కమీషన్ ఇచ్చి వాగ్దానం చేసిన కొంత మంది దళితులకు మాత్రమే అందింది. దళితులు, ఆదివాసీలకు భూమి ఇస్తామని హామీ ఇచ్చారు కానీ వాటిని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారు.

10 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు కానీ ఆ హామీ కూడా నెరవేరలేదు. నిరుద్యోగ యువకులకు రూ.3000 భృతి ఇస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. అందువల్ల వారి వాగ్దానాలు విలువ లేనివి అంటూ ఎద్దేవా చేశారు. మరియు కేసీఆర్ హామీలను ఎవరూ వాటిని నమ్మరు. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడంతోపాటు కాంగ్రెస్ మూడో స్థానంలో నిలవడం ఖాయమని జవదేకర్ అన్నారు. కాగా.. బిజెపి అభ్యర్థుల మొదటి జాబితాను అక్టోబర్ 18 న విడుదల చేస్తుంది. రాష్ట్రంలో ఇప్పటికే అభ్యర్థుల స్క్రీనింగ్ పూర్తయింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షాతో సహా అక్టోబర్ 17న సమావేశం కానున్నారు.ఈ సమావేశంలో తెలంగాణకు చెందిన అభ్యర్థులపై మాత్రమే పార్టీ అగ్ర ప్యానెల్ చర్చిస్తుంది.

బీఆర్ఎస్ మేనిఫెస్టో అంశాలు:
సౌభాగ్య లక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు రూ. 3 వేల గౌరవ వేతనం
దివ్యాంగులు పెన్షన్లు రూ. 6 వేలకు పెంపు
ఆసరా పెన్షన్లు రూ.5 వేలకు పెంపు
రైతుబంధు కింద అందిస్తున్నరూ.10 వేల సాయాన్ని 16 వేలకు పెంపు
బీసీలకు అమలు చేస్తున్న పథకాలు కొనసాగుతాయి
దళితబందు పథకం కొనసాగింపు
గిరిజనేతరులకు పోడు భూములు ఇచ్చే అంశం పరిశీలన
ఆరోగ్యశ్రీ పథకం రూ. 15 లక్షల పెంపు
అర్హులైన వారందరికీ రూ. 400కే సిలిండర్, అక్రిడేషన్ ఉన్న జర్మలిస్టులకు కూడా రూ. 400కే సిలిండర్
తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి సన్నబియ్యం
కేసీఆర్ బీమా ప్రతి ఇంటిటి ధీమా పేరుతో రూ. 5 లక్షల బీమా పథకం (93 లక్షల మందికి లబ్ధి)
హైదరాబాద్‌లో మరో లక్ష డబుల్ బెడ్‌రూం ఇళ్లు
ప్రభుత్వ ఉద్యోగుల ఓపీఎస్ డిమాండ్‌పై కమిటీ ఏర్పాటు
లంబాడీ తండాలు, గోండు గూడేలను పంచాయతీలను చేస్తాం.
అసైన్డ్ భూములు కలిగి ఉన్నవారికి భూ హక్కులు
ఇంటి స్థలం లేని పేదలకు ఇళ్ల స్థలాలు

Also Read: Balineni Srinivasa Reddy : ఈసారి ఎన్నికలు అంత ఈజీ గా ఉండవంటున్న వైసీపీ ఎమ్మెల్యే