BRS vs Congress : లోక్‌ సభ ఎన్నికల కంటే ముందే బీఆర్‌ఎస్‌ ఖాళీ..?

రాజకీయాల్లో చరిత్ర పునరావృతం చేయాలని కాంగ్రెస్ (Congress) భావిస్తూ అందుకు తగ్గట్టుగా వ్యూహాలు రచిస్తోంది. గతంలో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సిఎల్‌పి) (CLP)ని బిఆర్‌ఎస్‌లో విలీనం చేసినప్పుడు బిఆర్‌ఎస్ (BRS) ఉపయోగించిన ఫార్ములానే కెసిఆర్‌ (KCR)పై దాడికి ఆ పార్టీ ఉపయోగిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున గులాబీ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.

  • Written By:
  • Updated On - March 20, 2024 / 11:56 PM IST

రాజకీయాల్లో చరిత్ర పునరావృతం చేయాలని కాంగ్రెస్ (Congress) భావిస్తూ అందుకు తగ్గట్టుగా వ్యూహాలు రచిస్తోంది. గతంలో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సిఎల్‌పి) (CLP)ని బిఆర్‌ఎస్‌లో విలీనం చేసినప్పుడు బిఆర్‌ఎస్ (BRS) ఉపయోగించిన ఫార్ములానే కెసిఆర్‌ (KCR)పై దాడికి ఆ పార్టీ ఉపయోగిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున గులాబీ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి సంబంధించి చర్చలు కూడా కొనసాగుతున్నాయి. మొత్తంగా బీఆర్‌ఎస్‌ఎల్పీని (BRSLP) కాంగ్రెస్‌లో విలీనం చేయడం ద్వారా కేసీఆర్‌ను రాజకీయంగా పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు అధికార పార్టీ సిద్ధమైంది.

తెలంగాణ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు మే 13న పోలింగ్ జరగనుండగా.. అప్పటికి బీఆర్‌ఎస్‌ఎల్పీ విలీన ప్రక్రియను పూర్తి చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా క్షేత్రస్థాయిలో పని చేసేందుకు బీఆర్‌ఎస్‌ను నాయకులు లేకుండా చేయడమే వారి ప్రధాన లక్ష్యం. అందులో భాగంగానే గ్రేటర్‌ హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఇప్పటికే బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో బీఆర్‌ఎస్‌కు 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మెజారిటీ శాసనసభ్యులు కాంగ్రెస్‌లోకి మారేందుకు క్యూ కడుతున్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

దాదాపు 30 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. పార్టీలో చేరబోతున్న ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ముందుగా గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు, ఆ తర్వాత మెదక్, కరీంనగర్ జిల్లాల ఎమ్మెల్యేలు చేరతారని తెలుస్తోంది. దశలవారీగా ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా లోక్‌సభ ఎన్నికలకు ముందే బీఆర్‌ఎస్‌ఎల్‌పీ విలీనాన్ని పూర్తి చేయాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. దీనికి నిరద్శనంగా నేడు ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య (Beerla Ilaiah) చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరింత కాకరేపుతున్నాయి. కాంగ్రెస్‌ పాలనకు ఆకర్షితులై.. మా పార్టీతో దాదాపు 26 నుంచి 30 మంది బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు టచ్‌లో ఉన్నారని.. ఇక వారు రేపో మాపో కాంగ్రెస్‌ పార్టీలో చేరడం ఖాయమని అన్నారు.
Read Also : AP Politics : శ్రీకాకుళంలోని అసెంబ్లీ స్థానాలకు త్రిముఖ పోటీ..!