మహారాష్ట్ర రాజకీయాలపై కేసీఆర్(BRS) కన్నేశారు. ఆ రాష్ట్రంలో ఇప్పటికే రెండు చోట్ల బహిరంగ సభలు పెట్టిన ఆయన(KCR) మూడో సభను ఔరంగాబాద్ లో పెట్టారు. భారత రాష్ట్ర సమితి పార్టీని పెట్టిన తరువాత దూకుడుగా ఆయన వెళుతోన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఉంది. అక్కడ నుంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని పార్టీని సమాయాత్తం చేస్తున్నారు. మరాఠాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కేసీఆర్ సభలు పెట్టడం రాజకీయ వర్గాలను ఆలోచింప చేస్తోంది. రాబోవు రోజుల్లో ఎన్సీపీని దెబ్బతీసేందుకు వేస్తోన్న ఎత్తుగడగా భావిస్తున్నారు.
మహారాష్ట్ర రాజకీయాలపై కేసీఆర్(BRS)
ఔరంగాబాద్‌లో బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు(KCR) సోమవారం పాల్గొనే బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే ఎ.జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు బీఆర్‌ఎస్ నాయకులు గత రెండు వారాలుగా ఔరంగాబాద్‌లో మకాం వేశారు. మహారాష్ట్రలో జరుగుతున్న మూడో బీఆర్‌ఎస్(BRS) బహిరంగ సభను విజయవంతం చేయడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఔరంగాబాద్‌తోపాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి లక్ష మందికిపైగా జనాన్ని సమీకరించేందుకు పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఔరంగాబాద్‌లో బీఆర్‌ఎస్ బహిరంగ సభ
అభివృద్ధి కార్యక్రమాలు మరియు సంక్షేమ పథకాల “తెలంగాణ మోడల్” ప్రచారం కోసం బీఆర్ఎస్ (BRS) నాయకులు ఎల్ ఈడీ స్క్రీన్‌లు మరియు ఆడియో-విజువల్ పరికరాలతో అమర్చిన డజను వాహనాలను ఉపయోగించారు. ఈ వాహనాలు ఔరంగాబాద్‌తోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో పర్యటిస్తూ బీఆర్‌ఎస్‌కు ప్రజల మద్దతును కోరుతూ, సీఎం బహిరంగ సభకు హాజరుకావాలని ప్రచారం నిర్వహించారు. గత ఏడాది అక్టోబర్‌లో జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చిన తర్వాత, సీఎం మహారాష్ట్రపై ప్రత్యేక దృష్టి సారించారు. మరికొద్ది వారాల్లో జరగనున్న మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పోటీ చేస్తుందని సీఎం (KCR) ఇప్పటికే ప్రకటించారు.
తెలంగాణ అభివృద్ధి మోడల్ (BRS)
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్‌ఎస్(BRS) మహారాష్ట్ర రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద కూడా నమోదు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 5న నాందేడ్‌లో తొలి బహిరంగ సభ, మార్చి 26న కంధర్-లోహాలో రెండో బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. మహారాష్ట్రలోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పలువురు స్థానిక నేతలను బీఆర్ఎస్ చేర్చుకుంది. ఈ నేతలంతా సోమవారం ఔరంగాబాద్‌లో కేసీఆర్(KCR) సమక్షంలో అధికారికంగా బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు.
మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికల నుంచి
తెలంగాణ అభివృద్ధి మోడల్ ను దేశ వ్యాప్తంగా ప్రచారం చేయాలని కేసీఆర్(KCR) ప్లాన్ చేశారు. ఆ క్రమంలో మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల మీద ఆయన దృష్టి పెట్టారు. సాధారణంగా చట్టసభలకు జరిగే ఎన్నికల్లో మాత్రమే పార్టీకి వచ్చిన ఓటు బ్యాంకు బెంచ్ మార్క్ గా ఉంటుంది. అందుకే, తెలంగాణ ఉద్యమం సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు కేసీఆర్ దూరంగా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు కూడా అప్పట్లో దూరంగా ఉంటూ వ్యూహాత్మక రాజకీయాలను నడిపారు. రాష్ట్ర ఏర్పడిన తరువాత మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికల్లో TRS పోటీ చేయడం జరిగింది. కానీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికల నుంచి బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.
Also Read : BJP-BRS : మంత్రి, ఎమ్మెల్యే మధ్య భూ భాగోతం
తెలంగాణ మోడల్ ను ఇతర రాష్ట్రాలకు చూపిస్తోన్న కేసీఆర్ రాజకీయ వ్యూహంలో మాత్రం ప్రత్యేక రాష్ట్ర సాధన వ్యూహాలకు భిన్నంగా వెళుతున్నారు. దానికి కారణం లేకపోలేదు. ఆయా రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కు (BRS)గానీ, కేసీఆర్ కు గానీ ఎలాంటి గుర్తింపు లేదు. ప్రాథమిక గుర్తింపు కోసం పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనాలను మహారాష్ట్రలో ప్లాన్ చేశారు. సాధారణంగా పంచాయతీ ఎన్నికలు పార్టీలకు, సింబల్ కు అతీతంగా జరుగుతాయి. తటస్థ లీడర్లను ఎక్కువగా ఎన్నుకుంటారు. వాళ్లను బీఆర్ఎస్ పార్టీ లీడర్లుగా చెప్పుకోవడానికి ఒక అవకాశంగా కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే, స్థానిక సంస్థల ఎన్నికల మీద కేసీఆర్ దృష్టి పెట్టారు. మొదటి రెండు సభలు. విజయవంతం అయ్యాయని చెబుతోన్న బీఆర్ఎస్ ఔరంగాబాద్ లో సోమవారం జరిగే (KCR) సభ కూడా సూపర్ హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
Also Read : Danam Nagendra : `దానం` దారెటు.! BRS కు గుడ్ బై నా?