BRS Operation: బీ ఆర్ ఎస్ ఏపీ చీఫ్ తోట, కేసీఆర్ ఫస్ట్ ఆపరేషన్ ,JSPకి షాక్

సీనియర్ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ (Thota Chandrasekhar) BRS పార్టీ లో చేరబోతున్నారు. ఆయనకు ఏపీ అధ్యక్షుడి బాధ్యతలు ఇస్తున్నారని టాక్.

Published By: HashtagU Telugu Desk
Kcr Thota

Kcr Thota

సీనియర్ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ (Thota Chandrasekhar) BRS పార్టీ లో చేరబోతున్నారు. ఆయనకు ఏపీ అధ్యక్షుడి బాధ్యతలు ఇస్తున్నారని టాక్. జనసేన పార్టీలో కాపు సామాజివర్గానికి చెందిన ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర రావు జనసేన పార్టీని వీడనున్నట్లు సమాచారం. హైదరాబాదులో రెండవ తేదీన ఆయన కెసిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ తీర్ధాన్ని పుచ్చుకోనున్నారు .

అదే రోజు ఆంధ్ర ప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర పేరును కేసీఆర్ ప్రకటించనున్నారు. సోమవారం ఉదయం గుంటూరు అరండల్ పేట నుండి భారీ ఎత్తున ర్యాలీతో హైదరాబాదు వెళ్ళనున్నారు. తోట చంద్రశేఖర్ అభిమానులు ఇప్పటికే తన సన్నిహితులతో తను జనసేన పార్టీ వీడనున్నట్లు చంద్రశేఖర్ సంకేతాలను ఇచ్చారు.

రెండో తేదీన తనకు అందుబాటులో ఉండాలని వారిని కోరడం కూడా జరిగింది. జనసేనలో తోట చంద్రశేఖర్ ప్రస్తుతం పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడుగా కొనసాగుతున్నారు. తోట చంద్రశేఖర రావు బీ ఆర్ ఎస్ పార్టీలో చేరికతో ఆంధ్రప్రదేశ్ లో మరి కొంతమంది అధికారులు ఆయనతోపాటు వచ్చే ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం
కేసీఆర్ సమక్షంలో చేరికలు..
మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు బీఆర్ఎస్ చేరటం ఖాయంగా కనిపిస్తోంది. 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రావెల టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసారు. 2017లో మంత్రివర్గ విస్తరణలో పదవి పోవటంతో పార్టీకి రాజీనామా చేసారు. 2019 ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తరువాత బీజేపీ చేరారు. మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్దసారధి బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు.

రావెల కొద్ది నెలల క్రితం బీజేపీకి రాజీనామా చేసారు. ప్రస్తుతం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ లో ఏపీలో బాధ్యతల స్వీకరణకు సిద్దమయ్యారు. వీరిద్దరితో పాటుగా మరో ముగ్గురు గతంలో జనసేనలో పని చేసిన వారు కేసీఆర్ సమక్షంలో రేపు (సోమవారం) మధ్నాహ్నం గులాబీ కండువా కప్పుకోనున్నారు. వీరితో పాటుగా అనుచర వర్గం కూడా పార్టీలో చేరేందుకు సిద్దమైంది. ప్రధానంగా టీడీపీ – జనసేన మాజీ నేతల పైన బీఆర్ఎస్ గురి పెట్టినట్లు స్పష్టం అవుతోంది. రాయలసీమకు చెందిన ఒక కీలక నేత కుటుంబం కూడా కేసీఆర్ తో టచ్ లోకి వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ లోకి ఏపీ కీలక నేతలు చేరుతున్నారు. గత నెలలో కేసీఆర్ తన బీఆర్ఎస్ ను అధికారికంగా ప్రారంభించారు. పొరుగు రాష్ట్రాల్లో విస్తరణకు నిర్ణయించారు. ఏపీతో పాటుగా కర్ణాటక.మహారాష్ట్రలపైన ఆయన ఫోకస్ పెట్టారు. ఏపీ- తెలంగాణ రాజకీయాలు ముడి పడి ఉండటంతో ఇప్పుడు ఏపీకి చెందిన కొందరు ప్రముఖ నేతలు కేసీఆర్ పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారు. సోమవారం మంచి రోజు కావటంతో గులాబీ పార్టీలోకి చేరాలని నిర్ణయించారు. ఇక, ఏపీలో కేసీఆర్ పర్యటనకు ముహూర్తం ఖరారైంది. ప్రస్తుత చేరికల ద్వారా ఏపీలో కేసీఆర్ టార్గెట్ ఏంటనేది స్పష్టత వస్తోంది.
బీఆర్ఎస్ ఏపీలో విస్తరించే క్రమంలో ఇప్పటికే పలువురు నేతలు సీఎం కేసీఆర్ తో టచ్ లోకి వెళ్లారు. ఏపీలో ఉన్న సామాజిక సమీకరణాల్లో భాగంగా కేసీఆర్ ఎవరికి ఏ బాధ్యతలు ఇవ్వాలనే అంశం పైన కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. ముహూర్త పరంగా సోమవారం మంచి రోజు కావటంతో ఏపీ రాజకీయాల్లో ఉన్న పలువురు నేతలు బీఆర్ఎస్ కండువా కప్పుకోవటానికి సిద్దమయ్యారు. అందులో జనసేనలో అధినేత పవన్ కు కుడిభుజంగా పని చేసిన మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన రావెల కిషోర్ బాబు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మరో ముగ్గురు నేతల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. తోట చంద్రశేఖర్ కొంత కాలంగా జనసేన వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఐటి కంపెనీ అధినేతగా, ఒక మీడియా సంస్థ అధిపతిగా ఉన్న తోట చంద్రశేఖర్ ఇప్పుడు బీఆర్ఎస్ లోకి వెళ్లాలని అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. గతంలో ప్రజారాజ్యం, వైసీపీ, 2019 ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

  Last Updated: 01 Jan 2023, 08:20 PM IST