కేసీఆర్ తెలంగాణ ఎన్నికల ప్రచారం లో అపశృతి చోటుచేసుకుంది. సోమవారం భువనగిరి (Bhuvanagiri) లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభ (Praja Ashirvadha Sabha) లో ఓ కార్యకర్త గుండెపోటు (BRS activist died)తో మరణించారు. నవంబర్ 30 న తెలంగాణ లో ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గులాబీ బాస్ (KCR) నిన్న ఆదివారం నుండి ప్రచారం మొదలుపెట్టారు. ముందుగా హుస్నాబాద్ లో భారీ సభ ఏర్పాటు చేసిన కేసీఆర్..నేడు జనగాం , భువనగిరి సభల్లో పాల్గొన్నారు.
భువనగిరి సభకు కార్యకర్తలు పోటెత్తారు. ఈ క్రమంలో పోచంపల్లి మండలం జూలూరుకు చెందిన సత్తయ్య (G Sathaiah)అనే కార్యకర్త.. సభ ప్రాంగణంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన మిగతా కార్యర్తలు.. హుటాహుటిన సత్తయ్యను ఆస్పత్రికి తరలించారు. అయితే.. సత్తయ్యను పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మరణించినట్లు (Heart Attack) నిర్దారించారు. ఈ ఘటన.. సీఎం కేసీఆర్ వచ్చేకంటే ముందే జరగ్గా.. సభలో ఎలాంటి గందరగోళ పరిస్థితులు నెలకొనలేదు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక ఈ సభలో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ఫై విమర్శల వర్షం కురిపించారు. ‘కౌలు రైతు అంటే వ్యవసాయం చేసుకునేందుకు భూమిని మరొకరికి కిరాయికి ఇస్తాం. హైదరాబాద్‌లో భూములను కిరాయికి ఇస్తరు. ఇక్కడెందుకు కబ్జాదారుల పేరు రాయరు. రైతులు అగ్గువకు దొరికారు.. రైతులతో ఆటాడుకోవచ్చనే దురుద్దేశంతో.. రైతులను ఇబ్బందుల పాలు చేసిన కాంగ్రెస్ రాజ్యం మళ్లీ రావాలా..? మళ్లీ పాత బాధలు కలగాలా? దయచేసి రైతు సోదరులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్న కాంగ్రెస్ దెబ్బపడుతుంది. మళ్లీ పాత పైరవీకారులు వస్తరు.. వీఆర్వోలు వస్తరు.. రికార్డులు మారుతయ్.. చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి’ అన్నారు.
భువనగిరిలో అరాచక శక్తులను పెంచి పోషించింది కాంగ్రెస్సేనని .. అలాంటి అరాచక శక్తులను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్మూలించిందని కేసీఆర్ అన్నారు. ఒకప్పుడు కరవు ప్రాంతమైన భువనగిరిలో.. ఇప్పుడు పుష్కలంగా పంటలు పండుతున్నాని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్‌ను మరోసారి గెలిపిస్తే భువనగిరిలో ఐటీ పార్కు ఏర్పాటు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.
Read Also : Chinta Mohan : తెలంగాణలో కాంగ్రెస్ 75 స్థానాలతో అధికారం చేపట్టబోతుంది – కేంద్ర మాజీ మంత్రి కామెంట్స్