TG Lok Sabha Poll : లోక్ సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ విజయం సాదించబోయే సీట్లు ఇవే – కేటీఆర్

నాగర్ కర్నూలు, సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరి, కరీంనగర్, ఖమ్మం, మెదక్‌, చేవెళ్లలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు భారీ విజయం సాదించబోతున్నారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు

  • Written By:
  • Publish Date - May 15, 2024 / 08:43 PM IST

మే 13 న తెలంగాణ లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ పూర్తి అయ్యింది. వీటి ఫలితాలు జూన్ 04 న రాబోతున్నాయి. ఈ క్రమంలో ఈ ఎన్నికల విజయం ఫై ఎవరికీ వారే రాజకీయ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ 12 నుండి 14 సీట్లు సాదించబోతుందని చెపుతుంటే..బిజెపి సైతం అత్యధిక స్థానాల్లో బిజెపి విజయం సాదించబోతుందని అంటుంది. ఈ క్రమంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ సైతం గెలుపు ఫై ధీమా వ్యక్తం చేసారు. అంతే కాదు ఏ ఏ పార్లమెంట్ స్థానంలో విజయం సాదించబోతుందో కూడా తెలిపి ఆశ్చర్య పరిచాడు.

రాష్ట్రంలో ఎంపీ ఎన్నికల్లో సైలెంట్ ఓటింగ్ జరిగిందని, బీఆర్ఎస్‌ పార్టీకి ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లు వేశారని.. అధిక ఓట్లు పడ్డట్లు సర్వే ఆధారంగా చెబుతున్నానన్నాడు. అలాగే కాంగ్రెస్‌ ఒక్క నల్గొండ సీటు మాత్రమే గెలుస్తుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా సరైన అభ్యర్థులు పెట్టలేదని..వారంతా సరిగా లేరని కేటీఆర్ తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

నాగర్ కర్నూలు, సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరి, కరీంనగర్, ఖమ్మం, మెదక్‌, చేవెళ్లలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు భారీ విజయం సాదించబోతున్నారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పెద్దపల్లి, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌లో BJP Vs BRS పోటీపడుతున్నాయన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు లాభం జరిగే అవకాశం ఉందని తెలిపారు. సునీతా మహేందర్ రెడ్డికి మల్కాజిగిరికి సంబంధం ఏమిటని, బండి సంజయ్‌ని గెలిపించాలని అడ్రస్‌ లేని వెలిచాలకు కాంగ్రెస్‌ టికెట్‌ ఇచ్చారన్నారు. ఇక నాగర్‌కర్నూలు మా అభ్యర్థి ఆర్ఎస్పీతో ఇద్దరు అభ్యర్థులు సరితూగలేరని, ప్రవీణ్ ను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నాగర్‌కర్నూలు సమీకరణాలు మారాయయన్నారు. మరి కేటీఆర్ చెప్పినట్లే జరుగుతుందా..లేదా అనేది జూన్ 04 న తెలుస్తుంది.

Read Also : Jagan : చండీయాగాన్ని పూర్తి చేసిన జగన్..మరోసారి సీఎం అయినట్లేనా..?

Follow us