తెలంగాణలో రాజకీయ వేడి మళ్లీ పెరుగుతోంది. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బీఆర్‌ఎస్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్‌లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబతారని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్ దక్కకుండా ప్రజలు ఓటుతో తీర్పు సునిశితంగా ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు.
CM Revanth Meets Nadda : జేపీ నడ్డాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామన్న హామీని నెరవేర్చకుండానే వదిలేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలల్లోనే 21 లక్షల కోట్ల రుణమాఫీ చేశామని, 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయల రైతు భరోసా అందించామని పేర్కొన్నారు. అలాగే ఉచిత విద్యుత్, ఇన్సూరెన్స్, సన్న రైతులకు రూ.500 బోనస్ వంటి పథకాలతో తమ ప్రభుత్వం రైతుల పక్షాన నిలిచిందని చెప్పారు.
కృష్ణ, గోదావరి నదుల జలాలపై శాసనసభలో చర్చకు సిద్ధమని కూడా భట్టి స్పష్టం చేశారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు “రాష్ట్రం ఏమైనా పరవాలేదు, నీళ్లు వాడుకోండి” అని చెప్పారో లేదో బీఆర్ఎస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా చర్చకు సవాల్ విసిరినప్పుడు, బీఆర్ఎస్ నేతలు తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేస్తూ అసలు విషయాన్ని దారితప్పిస్తున్నారని విమర్శించారు.