తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana assembly Election) ఓటమి..పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా విజయం సాదించకపోవడం..అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 39 ఎమ్మెల్యేల్లో దాదాపు 09 మంది కాంగ్రెస్ లోకి వెళ్లడం..మరికొంతమంది కూడా ఇదే బాటలో వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం..మరోపక్క బిడ్డ జైలు జీవితం..రోజు రోజుకు ప్రజల్లో బిఆర్ఎస్ ఉనికి తగ్గుతూ ఉండడం..ఇదే క్రమంలో పలు స్కామ్ల పేరుతో కేసీఆర్ (KCR)ను అరెస్ట్ చేయాలనీ కాంగ్రెస్ సర్కార్ (Congress Govt) చూస్తుండడం..ఇలా వరుస ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నాడని.. తన పార్టీ బిఆర్ఎస్ ను బిజెపి లో విలీనం (Merger of BRS in BJP) చేసేందుకు సిద్ధం అయ్యాడనే ఓ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఓ మీడియా ఛానల్ లో బిఆర్ఎస్ పార్టీ ని బిజెపి లో విలీనం చేసేందుకు కేసీఆర్ సిద్దమయ్యాడనే ప్రచారం బిఆర్ఎస్ శ్రేణులను కలవరపాటుకు గురిచేస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజం..?
We’re now on WhatsApp. Click to Join.
ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణాలను సైతం ఫలంగా పెట్టి..తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్..ఈ చిన్న చిన్న ఇబ్బందులకు భయపడతాడా..? అధికారం శాశ్వతం కాదని నమ్మే కేసీఆర్..కాంగ్రెస్ కు భయపడి బిజెపి లో విలీనం చేస్తాడా..? ఎంత రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్…’తిమ్మిని బమ్మిని’ చేయగల సమర్థుడు..తన మాటలతో ప్రత్యర్థి పార్టీలకు చెమటలు పట్టించగల మాటకారి..బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు భయపడి తన పార్టీ ని మరో పార్టీ లో కలుపుతాడా..? ఇది ముమ్మాటికీ జరగని పని అని బిఆర్ఎస్ శ్రేణులు అంటున్న మాట.
పదేళ్ల లో తెలంగాణ ను దేశంలోనే నెం 1 రాష్ట్రంగా అభివృద్ధి చేసాడు. హైదరాబాద్ తో పాటు అనేక నగరాలను ఎంతో అభివృద్ధి చేసాడు. అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఇంటికి పెద్ద కొడుకు అయ్యాడు. రూ.200 పెన్షన్ ను రూ.2 వేలు చేసిన ఘనుడు..మారుమూల గ్రామానికి కూడా భగీరథ నీరు తెచ్చి నీటి ఎద్దడి లేని రాష్ట్రంగా తీర్చి దిద్దిన ధీరుడు..రైతున్నాలపాలిట దేవుడైన కేసీఆర్..వెనకడుగు వెయ్యడమా..అసాధ్యం అని అంటున్నారు. ఎన్ని కష్టాలు వచ్చిన , ఎన్ని ఇబ్బందులు పెట్టిన, అన్ని తట్టుకొని మళ్లీ సీఎం అవుతాడని..తెలంగాణ ప్రజల కష్టాలను తీరుస్తాడని ఆ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగా పార్టీ శ్రేణులు భావిస్తుందే జరుగుతుందా..? లేక మీడియా లో ప్రచారం అవుతున్నట్లు బిజెపి లో విలీనం చేస్తారా..? అనేది కేసీఆరే క్లారిటీ ఇవ్వాలి.
Read Also : Bigg Boss : బిగ్ బాస్ ఫ్యాన్స్ కు ‘బిగ్ షాక్’