BRS vs Congress Telangana Polls 2023: : బిఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్యనే అసలైన పోరు..

రాష్ట్రంలోపట్టుమని 10 నియోజకవర్గాల్లో తప్పించి మిగతా అన్ని చోట్ల బిఆర్ఎస్ - కాంగ్రెస్ మధ్య అసలైన పోటీ కనిపిస్తుంది

Published By: HashtagU Telugu Desk
Brs Cng War

Brs Cng War

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు (Telangana Polls 2023) వచ్చే నెలలో జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలు ప్రధానంగా బిఆర్ఎస్ – కాంగ్రెస్ (BRS vs Congress )మద్యే అసలైన వార్ జరగబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. రాష్ట్రంలో పట్టుమని 10 నియోజకవర్గాల్లో తప్పించి మిగతా అన్ని చోట్ల బిఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్య అసలైన పోటీ కనిపిస్తుంది. మిగతా పార్టీల కంటే ముందే గులాబీ బాస్ కేసీఆర్ (KCR) తమ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల సమరం మొదలుపెట్టారు. ఇక కాంగ్రెస్ పార్టీ (Congress Party) సైతం రీసెంట్ గా 55 మంది అభ్యర్థులను ప్రకటించి ప్రచారం మొదలుపెట్టింది. ఈరోజు కానీ రేపు కానీ మిగతా అభ్యర్థులను ప్రకటించబోతుంది. ఇక బిజెపి (BJP) విషయానికి వస్తే ఇంతవరకు అభ్యర్థుల ప్రకటన చేయలేదు..అలాగే ఎన్నికల ప్రచారం సైతం పూర్తి స్థాయిలో మొదలుపెట్టలేదు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్న పార్టీలు పేరుకు డజను పైగా ఉన్నప్పటికీ..ఎక్కడ కూడా వాటి హావ కనిపించడం లేదు..ఎక్కడ చూడు బిఆర్ఎస్ – కాంగ్రెస్ జెండాలు , ఆ పార్టీ తాలూకా మనుషులు , ప్రచారమే కనిపిస్తుంది తప్ప..మిగతా పార్టీల ఉనికి ఎక్కడ కనిపించడం లేదు. ముఖ్యంగా ప్రతీ నియోజకవర్గంలో చేరిక రాజకీయాలు బాగా ఊపందుకున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని బీఆర్ఎస్ తమ పార్టీలోకి తీసుకువస్తుంటే.. బీఆర్ఎస్ కు చెందిన వారిని, సిట్టింగ్ అభ్యర్థులపై అసమ్మతితో ఉన్నవారిని, గతంలో తమ పార్టీలో ఉండి బీఆర్ఎస్ లో చేరిన వారికి కాంగ్రెస్ గాలం వేస్తోంది. దీంతో మండలాలు, గ్రామాల్లో ఎక్కడికక్కడ ఎన్నికల రాజకీయ వాతావరణం వేడెక్కినట్లు కనిపిస్తోంది. ప్రతి రోజు గ్రామాల్లోను పెద్ద ఎత్తున ఇరు పార్టీల నేతలు తమ ప్రచారం తో హోరెత్తిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ , నల్గొండ , సూర్యాపేట , జనగాం , మహబూబాబాద్ , ఖమ్మం , భద్రాచలం ఇలా పలు జిల్లాలో ఎక్కువగా కాంగ్రెస్ – బిఆర్ఎస్ హవానే కనిపిస్తుంది తప్ప బిజెపి ఎక్కడ కనిపించడం లేదు. ఇలా ఓవరాల్ గా ఈసారి ఎన్నికలు కాంగ్రెస్ – బిఆర్ఎస్ ల మధ్యనే ఉండబోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది.

Read Also : Venkaiah Naidu : వెంకయ్య నాయుడుకు అరుదైన గౌరవం.. కీలక అవకాశం కల్పించిన ప్రధాని

  Last Updated: 22 Oct 2023, 08:22 AM IST