Site icon HashtagU Telugu

Flex War : ‘దమ్ముంటే రాజీనామా చెయ్ రవ్వంత రెడ్డి’ – బిఆర్ఎస్ పోస్టర్లు

Brs Posters

Brs Posters

హైదరాబాద్లో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల మధ్య ఫ్లెక్సీల వార్ వాడివేడిగా నడుస్తుంది. నిన్న ఎమ్మెల్యే హరీశ్ రావు రాజీనామా చేయాలని నగరంలోని చాలా ప్రాంతాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. వీటికి కౌంటర్ గా ‘దమ్ముంటే రాజీనామా చెయ్ రవ్వంత రెడ్డి. అమరవీరుల స్తూపం వద్ద ముక్కు భూమికి రాయి రైఫిల్ రెడ్డి’ అని, ‘చెప్పింది కొండంత.. చేసింది రవ్వంత’ అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

కాంగ్రెస్ పార్టీ (Congress Party ) చెప్పినట్లే ఆగస్టు 15 న మూడో విడత రైతు రుణ మాఫీ (Runamafi ) పూర్తి చేసింది. మొదటి విడత లో లక్ష లోపు , రెండో విడత లో లక్షన్నర , మూడో విడత లో రెండు లక్షల రుణ మాఫీ ని పూర్తి చేసి మాట నిలుపుకుంది. కాంగ్రెస్ అంటే మాట నిలుపుకునే పార్టీ అని..కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటూ..గత ప్రభుత్వం బిఆర్ఎస్ ఫై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా మాజీ మంత్రి , సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) ఫై ఓ రేంజ్ లో విమర్శలు , సవాళ్లు , ఛాలెంజ్ లు చేస్తూ వస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

వైరా సభలో సీఎం రేవంత్ ఏ రేంజ్ లో హరీష్ రావు ఫై చిందులు వేసారో తెలియదు కాదు..ఇది చాలదు అన్నట్లు నేడు నగరవ్యాప్తంగా హరీష్ రావు రాజీనామా చేయాలనీ.. అగ్గిపెట్టె హరీష్‌రావు అంటూ భారీ ప్లెక్సీ లు ఏర్పాటు చేసారు. చెప్పినట్టు రుణమాఫీ చేశామని తమకు రాజీనామా ఎప్పుడు చేస్తారని ఆ ఫ్లెక్సీల్లో ప్రశ్నిస్తున్నారు. రుణమాఫీ అయిపోయే నీ రాజీనామా ఏడబోయే అంటూ నిలదీస్తున్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అభిమానుల పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హరీష్‌రావును టార్గెట్ చేశారు. దీనికి బిఆర్ఎస్ కూడా అదే రేంజ్ లో కౌంటర్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. రెండు లక్షలు ఉన్న ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తామని చెప్పి..కనీసం సగం కూడా చేయలేదని బిఆర్ఎస్ విమర్శలు మొదలుపెట్టింది. ఒక గ్రామంలో వంద మంది రెండు లక్షల రుణ మాఫీ వారు ఉంటె..కేవలం ఆరుగురికి మాత్రమే రుణమాఫీ చేసి చేతులు దులుపుకుంది. సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్‌లో అందరికీ రుణమాఫీ అయినట్టు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాలు వదిలేస్తానని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌ చెప్తున్న రుణమాఫీ ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్‌ అని ఎద్దేవా చేశారు. కొడంగల్‌లోని ఏ గ్రామానికైనా వెళ్దామని, వందశాతం రుణమాఫీ అయిందని ఒక్క రైతు చెప్పినా తాను అక్కడే రాజీనామా చేసి స్పీకర్‌కు లేఖ పంపిస్తానని చెప్పారు. సీఎంకు దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలన్నారు.

రుణమాఫీకి తొలుత రూ. 40 వేల కోట్లు, ఆ తర్వాత రూ. 31 వేల కోట్లు అవసరమవుతాయని చెప్పారని, బడ్జెట్‌లో మాత్రం 26 వేల కోట్లు చూపించి.. 17 వేల కోట్లు మాత్రమే మాఫీ చేసి అంకెల గారడీ చేశారని విమర్శించారు. ఇటు ప్రజలు సైతం కాంగ్రెస్ సర్కార్ ఫై నిప్పులు చెరుగుతున్నారు.

Read Also : Monthly Interest Income : ప్రతినెలా వడ్డీ ఆదాయం కావాలా ? ఇవిగో టాప్ సేవింగ్స్ స్కీమ్స్