BRS Votes to TRS : బీఆర్ఎస్‌ ఓట్లు టీఆర్ఎస్ కు..?

టీఆర్ఎస్(తెలంగాణ రాజ్య సమతి) పేరుతో సిద్దిపేట జిల్లా పొన్నాల గ్రామానికి చెందిన బాలరంగం పార్టీని ఏర్పాటు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పోటీకి దిగబోతుంది

  • Written By:
  • Publish Date - October 20, 2023 / 08:46 AM IST

బిఆర్ఎస్ (BRS) ఓట్లు టిఆర్ఎస్ (TRS) కు అదేంటి..? రెండు ఒకటే కదా అని అనుకుంటున్నారా..? కాదు రెండు వేరు. గతంలో టిఆర్ఎస్ గా ఉన్న కేసీఆర్ (KC) పార్టీ ఇప్పుడు బిఆర్ఎస్ గా మారిన సంగతి తెలిసిందే. జాతీయ స్థాయిలో సత్తా చాటాలని ఉద్దేశంతో కేసీఆర్..టిఆర్ఎస్ ను కాస్త బిఆర్ఎస్ గా మార్చారు. దీంతో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్(తెలంగాణ రాజ్య సమతి) పేరుతో మరో పార్టీ బరిలో దిగుతుంది. ఇదే ఇప్పుడు బిఆర్ఎస్ కు తలనొప్పిగా మారింది. బిఆర్ఎస్ ఓట్లు టిఆర్ఎస్ కు పడే ఛాన్స్ ఉందని అంత మాట్లాడుకుంటున్నారు.

ఎన్నికల వేళా ఓ పార్టీ పోలిన గుర్తులు మరో పార్టీలకు కేటాయిస్తుంటుంటారు. గతంలో బిఆర్ఎస్ పార్టీ కి ఇలాంటివి ఎదురయ్యాయి. కారు గుర్తును పోలిన గుర్తులను వివిధ పార్టీలకు ఈసీ (Election Commission) కేటాయించడంతో చాలామంది బీఆర్ఎస్ అనుకోని వేరే పార్టీ లకు ఓటు వేయడం జరిగింది. హుజూరాబాద్, మునుగోడు ఉపఎన్నికల సమయంలో పోటీలోకి దిగిన వివిధ ఇండిపెండెంట్ అభ్యర్థులకు కారు గుర్తుతో పోలి ఉన్న రోడ్డు రోలర్ లాంటి గుర్తులను ఈసీ కేటాయించింది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసినా లాభం లేకపోయింది. అలాగే హైకోర్టు, సుప్రీంకోర్టులను బీఆర్ఎస్ ఆశ్రయించినా ఫలితం దక్కలేదు.

We’re now on WhatsApp. Click to Join.

ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల (2023 Telangana Elections) సమయంలో కూడా అలాగే జరుగుతాయని..గ్రహించిన బిఆర్ఎస్ నేతలు ఈసీ కి పిర్యాదు చేసిన ఈసారి కూడా లాభం లేకుండా పోయింది. తాజాగా టీఆర్ఎస్(తెలంగాణ రాజ్య సమతి) పేరుతో సిద్దిపేట జిల్లా పొన్నాల గ్రామానికి చెందిన బాలరంగం (Baalarangam) పార్టీని ఏర్పాటు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పోటీకి దిగబోతుంది. ఈ పార్టీకి ఈసీ వంట గ్యాస్ సిలిండర్ గుర్తును కేటాయించింది.

బీఆర్ఎస్, టీఆర్ఎస్ పేరు ఒకేలా ఉండటం, టీఆర్ఎస్ కూడా పోటీ చేయనుండటంతో ఓటర్లు అయోమయానికి గురై ఛాన్స్ ఉంది. పేరు ఒకేలా ఉండటంతో ఒక పార్టీకి ఒటు వేయబోయి మరో పార్టీకి ఓటు వేసే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఈ ఎఫెక్ట్ బిఆర్ఎస్ పార్టీ కి భారీగా పడనుందని అంత భావిస్తున్నారు. గతంలో ఎన్నికల సింబల్స్ వల్ల బీఆర్ఎస్ చిక్కులు ఎదుర్కోగా.. ఇప్పుడు ఏకంగా పేరు వల్ల సమస్యలు ఎదురుకోబోతుంది. మరి ఎన్నికల్లో టిఆర్ఎస్ కు ఎన్ని ఓట్లు పడతాయో చూడాలి.

Read Also : Tiger Nageswara Rao Public Talk : టైగర్ నాగేశ్వరరావు టాక్ ఏంటి..?