SLBC టన్నెల్ ప్రమాదానికి (Telangana Tunnel Collapse) సంబంధించి ఈరోజు బీఆర్ఎస్ (BRS) బృందం అక్కడికి వెళ్లనుంది. మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) నేతృత్వంలో నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ నుంచి భారీ కాన్వాయ్ ర్యాలీగా బయలుదేరి టన్నెల్ వద్దకు చేరుకోనున్నారు. అయితే తమ పర్యటనను పోలీసులు అడ్డుకోవద్దని హరీశ్ రావు పేర్కొన్నారు. సహాయ చర్యలకు ఎలాంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతోనే ఇంతకాలం తాము అక్కడికి వెళ్లలేదని తెలిపారు.
Chardham Yatra: ఏప్రిల్ 30 నుంచి చార్‌ధామ్ యాత్ర, మార్చి 11 నుంచి ఆన్‌లైన్‌లో!
ఇక టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల ప్రాణాలపై అధికారులు ఆశలు వదులుకున్నారు. టీబీఎం మెషీన్ చుట్టూ భారీగా మట్టి, బురద పేరుకుపోవడంతో కార్మికులు గట్టెక్కే అవకాశం లేదని భావిస్తున్నారు. నిన్న ఆర్మీ రెస్క్యూ బృందం టన్నెల్ చివరి వరకు వెళ్లి పరిశీలించగా, అక్కడ మట్టి, బురద తప్ప ఎలాంటి మనుషుల జాడ కనిపించలేదని తెలిపారు. ప్రస్తుతం ప్రమాద స్థలంలో అత్యంత భయానక పరిస్థితులు నెలకొన్నాయని, శిథిలాలను తొలగిస్తే టన్నెల్ మళ్లీ కూలిపోయే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
Earthquake : మనదేశంలో మరో భూకంపం.. రోడ్లపైకి జనం పరుగులు
ప్రభుత్వం సహాయక చర్యలను మరింత వేగంగా చేపట్టాలని, కార్మికుల కుటుంబాలకు అండగా నిలవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. టన్నెల్ కూలిన ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హరీశ్ రావు అభిప్రాయపడ్డారు. ఈ ప్రమాదం కార్మికుల భద్రతపై కొత్త చర్చలకు దారితీసింది. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలని, బాధ్యత వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా రాజకీయ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.