BRS Twist : వారెవ్వా! కేసీఆర్ పాలి`ట్రిక్స్` మైండ్ బ్లోయింగ్!

సంచ‌ల‌నం సృష్టించిన లిక్క‌ర్ స్కామ్ ను మ‌ర‌చిపోయేలా తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్

  • Written By:
  • Publish Date - March 24, 2023 / 01:55 PM IST

డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేయ‌డంలో తెలంగాణ సీఎం కేసీఆర్ దిట్ట‌(BRS Twist). దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన లిక్క‌ర్ స్కామ్ ను మ‌ర‌చిపోయేలా తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ పేప‌ర్ లీకు(TSPSC) వ్య‌వ‌హారాన్ని మ‌ళ్లించారు. ఈ రెండు కేసులు బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టేలా ఉన్న‌ప్ప‌టికీ సానుకూలంగా మ‌లుచుకునే యాక్ష‌న్ ప్లాన్ కేసీఆర్ ర‌చించారు. మంత్రులు కేటీఆర్, హ‌రీశ్ రావు, క‌విత దాన్ని అమ‌లు చేస్తున్నారు. పేప‌ర్ లీకు అంశాన్ని విప‌క్షాల మెడ‌కు చుట్టే ప్ర‌య‌త్నం కొంత మేర‌కు విజ‌యం సాధించిన‌ట్టు క‌నిపిస్తోంది. సిట్ ద్వారా విప‌క్షాల‌ను ముప్పుతిప్ప‌లు పెడుతున్నారు. అనుమానాల‌ను వ్య‌క్తం చేసిన వాళ్ల‌కు నోటీసులు ఇవ్వ‌డం ద్వారా ఆరోప‌ణ‌ల‌కు అడ్డుక‌ట్ట వేయ‌గ‌లిగారు.

డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ దిట్ట‌ (BRS Twist)

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ పేప‌ర్ (TSPSC) కుంభ‌కోణం ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ ను మించింది. లిక్క‌ర్ స్కామ్ 100 కోట్ల లావాదేవీల వ్య‌వ‌హారం. అదే, పేప‌ర్ లీక్ వ్య‌వ‌హారం 30ల‌క్ష‌ల మంది నిరుద్యోగులు, వాళ్ల కుటుంబీకుల‌కు సంబంధించిన కుంభ‌కోణం. దాన్ని అదుపు చేయ‌క‌పోతే రాజ‌కీయంగా న‌ష్టం వ‌స్తుంద‌ని గ్ర‌హించిన కేసీఆర్ విప‌క్షాల మీద పైచేయిగా (BRS Twist)నిలిచే ప్ర‌య‌త్నం మొద‌లుపెట్టారు. పేప‌ర్ లీక్ బ‌య‌ట‌ప‌డిన రోజే నిందితుల్లో రాజ‌శేఖ‌ర్ రెడ్డి బీజేపీ కార్య‌క‌ర్త అంటూ బీఆర్ఎస్ ప్ర‌చారం చేసింది. ఆ త‌రువాత మంత్రి కేటీఆర్ పీఏ తిరుప‌తి వ్య‌వ‌హారాన్ని బీజేపీ, కాంగ్రెస్ బ‌య‌ట‌కు తీశాయి. సూత్ర‌ధారిగా తిరుప‌తిని ఎలివేట్ చేస్తూ మంత్రి కేటీఆర్ బ‌ర్త‌ర‌ఫ్ కు డిమాండ్ చేయ‌డం జ‌రిగింది. ఇక ఆరోజు నుంచి విప‌క్షాల‌ను క‌ట్ట‌డీ చేయ‌డానికి సిట్ రంగంలోకి దిగింది.

ఈడీ డీలా ప‌డేలా క‌విత స‌మాధానం

పేప‌ర్ లీక్ స‌మ‌యంలోనే ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో క‌విత‌ను ఈడీ విచారించింది. ఆ స్కామ్ బీఆర్ఎస్ పార్టీకి న‌ష్టం చేకూర్చుతుంద‌ని విప‌క్షాలు భావించాయి. కానీ, డేర్ గా క‌విత విచార‌ణ‌కు ఎదుర్కొవ‌డంతో పాటు ఈడీ డీలా ప‌డేలా క‌విత స‌మాధానం ఇచ్చారు. ఆ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదికగా రెండోసారి విచార‌ణ‌కు వెళ్లేట‌ప్పుడే బీఆర్ఎస్ (BRS Twist) ప్ర‌చారం చేసింది. ఇక మూడోసారి అరెస్ట్ అంటూ విప‌క్షాలు చేసిన ప్ర‌చారానికి భిన్నంగా న‌వ్వుకుంటూ క‌విత బ‌య‌ట‌కు రావ‌డం క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి ఊర‌ట‌నిచ్చింది. ఆ అంశాన్ని తెలంగాణ స‌మాజానికి, తెలంగాణ మ‌హిళ‌కు జ‌రిగిన అవ‌మానంగా క్రియేట్ చేసింది. ఆ కేసు విచార‌ణ చ‌ల్లార‌క ముందే పేపర్ లీకు (TSPSC) అంశాన్ని విప‌క్షాలు క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి చుట్టేశారు. లిక్క‌ర్ స్కామ్ విచార‌ణ‌లో తేరుకున్న వెంట‌నే పేప‌ర్ లీకు వ్య‌వ‌హారం మీద బీఆర్ఎస్ దృష్టి పెట్టింది.

మంత్రి కేటీఆర్ చుట్టూ లీక్ కేసు

విప‌క్ష లీడ‌ర్లు రేవంత్ రెడ్డి, బండి సంజ‌య్ పోటాపోటీగా పేప‌ర్ లీక్ (TSPSC) అంశాన్ని తెలంగాణ స‌మాజం ముందుకు దూకుడుగా తీసుకెళ్లారు. మంత్రి కేటీఆర్ చుట్టూ లీక్ కేసును తిప్పారు. అంతేకాదు, పీఏ తిరుప‌తి కేంద్రంగా మంత్రి కేటీఆర్ ఛాంబ‌ర్ చుట్టూ పేప‌ర్ లీకు అంశాన్ని ఫిక్స్ చేస్తూ ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు, లీడ‌ర్ల‌కు చెందిన కుటుంబీకులు ఎక్కువ మార్కులు పొందార‌ని బండి సంజ‌య్ తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పించారు. ఒకే మండలంలోని వాళ్లు 100కు పైగా మార్కులు ఎక్కువ మంది పొందార‌ని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పేప‌ర్ లీకు దందా వెనుక క‌ల్వ‌కుంట్ల కుటుంబం ఉంద‌ని పాద‌యాత్ర‌లో రెచ్చిపోయారు. ఇలాంటి ఆరోప‌ణ‌ల మీద సిట్ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆ నోటీసుల చుట్టూ పేప‌ర్ లీకు(BRS Twist) అంశం మ‌ళ్లింది.

Also Read : Kavitha BRS : డాట‌ర్ ఆఫ్ పైట‌ర్ గ్రాఫ్ పైపైకి! బీజేపీ ఢ‌మాల్‌!

రాజ‌కీయ పార్టీల‌కు అనుబంధంగా ఉండే విద్యార్థి సంఘాలు పేప‌ర్ లీకు (TSPSC) కుంభ‌కోణం మీద రోడ్ల మీద‌కు వ‌చ్చారు. నిర‌స‌న‌ల‌ను ఉవ్వెత్తున దిగారు. దీక్ష‌లు చేయ‌డానికి విద్యార్థి నాయ‌కులు ముందుకొచ్చారు. ఉస్మానియా యూనివ‌ర్సిటీ అట్టుడికిపోయేలా నిరుద్యోగులు ఉద్య‌మానికి దిగారు. ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్, బీజేపీ కూడా దీక్ష‌ల‌కు దిగింది. నిరుద్యోగుల కోసం పోరాటం చేయ‌డానికి దీక్ష‌ల‌కు దిగారు. విప‌క్ష నేత‌ల‌ను ఎక్క‌డిక‌క్క‌డ రెండో రోజులుగా హౌస్ అరెస్ట్ లు చేస్తున్నారు. అదే స‌మ‌యంలో వాళ్లు దూకుడుగా మాట్లాడ‌కుండా ఆరోప‌ణ‌ల‌కు ఆధారాలు కావాలంటూ విప‌క్ష నేత‌ల్ని సిట్ విచారిస్తోంది. ఇలాంటి గంద‌ర‌గోళం మ‌ధ్య పేప‌ర్ లీక్ అంశం రాజ‌కీయ పార్టీల మ‌ధ్య (BRS Twist)ఆధిప‌త్య‌పోరుగా మారిపోయింది.

Also Read : KCR Delhi Tour: లిక్కర్ స్కామ్ ఎఫెక్ట్.. ఢిల్లీ పర్యటనకు కేసీఆర్ దూరం

పేప‌ర్ లీకును రాజ‌కీయ అంశంగా తీసుకురావ‌డంలో బీఆర్ఎస్ (BRS Twist) విజ‌యం సాధించింది. సిట్ విచార‌ణ చేస్తున్న‌ప్ప‌టికీ దోషులు ఎవ‌రు? ఎప్ప‌టి నుంచి టీఎస్పీఎస్ పేప‌ర్ (TSPSC) లీకు అవుతుంది? ఎన్ని పేప‌ర్లు అనే వాటికి ప్ర‌భుత్వం నుంచి స్ప‌ష్ట‌మైన స‌మాధానం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. మిగిలిన ప‌రీక్ష‌ల సంగ‌తి ఏమిటి? అనేది తెలియ‌దు. కొంద‌రు 2016 నుంచి ఈ పేప‌ర్ లీకు దందా జ‌రుగుతుంద‌ని ఆరోపిస్తున్నారు. మ‌రికొంద‌రు టీఎస్పీఎస్ ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి విజ్ఞ‌ప్తుల‌కు తావులేకుండా లీక్ ఎపిసోడ్ ను బీఆర్ఎస్ హైజాక్ చేసింది.

పేప‌ర్ లీకు అంశాన్ని రాజ‌కీయంగా మ‌లుస్తూ (TSPSC)

వాస్త‌వాల‌ను బ‌య‌ట పెట్ట‌డం ద్వారా నిరుద్యోగుల్లో విశ్వాసం పొందాల‌ని ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నం చేయ‌డంలేదు. పేప‌ర్ లీక్‌ కుంభ‌కోణానికి వీలున్నంత రాజ‌కీయ రంగు(BRS Twist) పుల‌మారు. దీంతో ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో క‌విత విచార‌ణ అంశం రెండు రోజుల్లోనే దాదాపుగా క‌నుమ‌రుగు అయింది. ఇప్పుడు పేప‌ర్ లీకు అంశాన్ని రాజ‌కీయంగా మ‌లుస్తూ విప‌క్షాల ఆరోప‌ణ‌ల రాద్దాంతంగా చెప్పే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. అందుకు సిట్ ఒక పావుగా ఉంద‌ని, సిట్టింగ్ జ‌డ్జి విచార‌ణను విప‌క్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మొత్తం మీద వ‌చ్చే ఎన్నిక‌ల రాజ‌కీయ అంశంగా పేప‌ర్ లీక్ (TSPSC) మారిపోయింది. లిక్క‌ర్ స్కామ్ దాదాపుగా మ‌రుగున ప‌డింది. ఇలాంటి రాజ‌కీయ ప‌రిణామమే బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కోరుకుంటున్న‌ది.

Also Read : BRS : హిందూ సెంటిమెంట్ , ఎన్నిక‌ల‌కు కేసీఆర్ ఎత్తుగ‌డ‌