Site icon HashtagU Telugu

BRS Tweet : కాంగ్రెస్ పాలనలో రైతుల మృత్యుఘోష – BRS ట్వీట్

Brs Tweet

Brs Tweet

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ లో అధికార పార్టీ కాంగ్రెస్ – బిఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు ఎక్కువైపోతోంది. సభలు , సమావేశాల్లోనే కాదు సోషల్ మీడియా వేదికగా కూడా ఇరు పార్టీలు ఒకరి ఫై ఒకరు విమర్శలు , ప్రతి విమర్శలు చేసుకుంటూ హోరెత్తిస్తున్నారు. తాజాగా బిఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పాలనలో రైతుల మృత్యుఘోష అంటూ ట్వీట్ చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

‘కేసీఆర్ పాలనలో పచ్చని పంటలతో కళకళలాడిన తెలంగాణ నేడు రైతుల ఆత్మహత్యలతో వెలవెలబోతోంది. బంగారం లాంటి పంటను మార్కెట్ కు పంపించి.. వచ్చిన డబ్బులతో రైతన్న సంతోషంగా ఉండాల్సిన సమయం ఇది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో అదే పంటను చూసి కన్నీళ్లు కార్చాల్సిన దుస్థితి వచ్చింది. నీళ్లో రామచంద్రా అని మొదటి రోజు నుంచి ప్రభుత్వాన్ని వేడుకున్నా కనికరించని కాంగ్రెస్ పాలకులు చుక్కనీళ్లు ఇవ్వలేదు. ఎదురుచూసి.. ఏడ్చి ఏడి అన్నదాతల కళ్లలో నీళ్లు కూడా ఇంకిపోయాయి. ఇక మిగిలింది తమ గొంతులో ప్రాణమొక్కటేనని దాన్నికూడా వదిలేస్తున్నారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోని జిల్లా, కరెంటు కోతలు లేని జిల్లాలే కాదు.. రైతుల ఆత్మహత్యలు లేని జిల్లాలు కూడా లేవు.’ అని BRS పార్టీ ట్వీట్ చేసింది. మరి దీనిపై కాంగ్రెస్ ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి.

Read Also : Bus Overturns: హ‌ర్యానాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఆరుగురు విద్యార్థులు దుర్మ‌ర‌ణం