Bhatti Vikramarka : యాదాద్రి లో డిప్యూటీ సీఎం కు అవమానం జరిగిందంటూ బిఆర్ఎస్ విమర్శలు

  • Written By:
  • Publish Date - March 11, 2024 / 09:32 PM IST

తెలంగాణ (Telangana) లో అధికార పార్టీ కాంగ్రెస్ – ప్రతిపక్ష పార్టీ బిఆర్ఎస్ (Congress Vs BRS) మధ్య వార్ నడుస్తుంది. త్వరలో లోక్ సభ ఎన్నికలు (Lok Sabha Elections) జరగనున్న క్రమంలో బిఆర్ఎస్ పార్టీ..కాంగ్రెస్ ఫై డేగ కన్నువేసింది. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగిన..జరగకపోయినా దానిపై పెద్ద రాద్ధాంతం చేస్తుంది. ఓ పక్క కాంగ్రెస్ సంక్షేమ పథకాలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కోటిగా నెరవేరుస్తూ వస్తున్నప్పటికీ..ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపణలు చేస్తూ వస్తుంది.

ఇదిలా ఉంటె ఈరోజు (మార్చి11) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy), కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి ( Komat Reddy Venkat Reddy), కొండా సురేఖ (, Konda Surekha) తదితరులు యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో సందర్బంగా శ్రీ ల‌క్ష్మీనర‌సింహ‌స్వామిని దర్శించుకొని ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, అమ్మవారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. రేవంత్ రెడ్డి సీఎం హోదాలో తొలిసారిగా యాదగిరిగుట్టకు రావడంతో.. ప్రొటోకాల్‌ సమస్యలు ఉత్పన్నం కాకుండా ఆలయ ఆఫీసర్లు, పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు.

కాగా యాదాద్రి దేవాలయంలో పూజల సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి దంపతులతో పాటు సహచర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిలను గౌరవంగా ఎత్తయిన పీఠ‌ల‌పై కూర్చోబెట్టి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, కొండా సురేఖ లకు అవమానకరంగా తక్కువ ఎత్తయిన పీఠలపై కూర్చో పెట్టి వారిని అవమానించారని బిఆర్ఎస్ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు కౌంటర్ ఇస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు ఎంతో గౌరవం ఇస్తుందని..దళిత సీఎం ను చేస్తా అని చెప్పి మీ అధినేతే మోసం చేసాడని..దళితుల పేర్లు చెప్పి అందర్నీ మోసం చేసారంటూ కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. మరి ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

Read Also : TBJP: బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు