BRS Legal Cell: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పై తప్పుడు కేసులు మోపుతున్నదని ఆరోపించారు బీఆర్ఎస్ సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. తప్పుడు కేసుల నుండి తమ పార్టీ కార్యకర్తలను రక్షించడానికి బీఆర్ఎస్ పార్టీ ‘లీగల్ సెల్’ను ఏర్పాటు చేయనున్నట్లు హరీష్ రావు ప్రకటించారు. హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లాల్లో ఈ సెల్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
కార్యకర్తల సంక్షేమం కోసం పార్టీ ట్రస్టు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు హరీష్ రావు. అలాగే పార్టీ బలోపేతానికి మండల, జిల్లా కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని చెప్పారు.రాష్ట్రంలో బీఆర్ఎస్ పై అధికార పార్టీ తప్పుడు సమాచారం సృష్టిస్తోందని వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని ‘స్పీడ్ బ్రేకర్’గా అభివర్ణించిన ఆయన కార్మికుల శ్రమతో బీఆర్‌ఎస్ మంచి పనితీరు కనబరుస్తుందని అన్నారు.అనేక ముఖ్యమైన పథకాలను అందించడంలో బీఆర్ఎస్ విజయవంతమైనప్పటికీ, సాధించిన విజయాలను ప్రజలకు తెలియజేయడంలో పార్టీ విఫలమైందని హరీష్ అన్నారు.
తెలంగాణ భవన్ లో జరిగిన మహబూబాబాద్ పార్లమెంటరీ స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ఓటమి కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని, భవిష్యత్తులో మళ్లీ అధికారంలోకి వచ్చేది తమ పార్టీనే అని పేర్కొన్నారు. నెల తర్వాత కేసిఆర్ కూడా తెలంగాణ భవన్ లో అడుగు పెడతారు. అందరం ఇక్కడే ఉంటాం. కలిసి పని చేద్దాం. ఎవరికైనా సమస్య వస్తే అందరం బస్ వేసుకొని మీ ముందుకు వస్తాం. మొదటి కేబినెట్ లో మొదటి డీఎస్సీ అన్నారు ఏమైందన్నారు హరీష్. ఖమ్మంలో మూడు రకాల కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి. వారిది వారికే పడటం లేదు. భవిష్యత్ మనదేనని స్పష్టం చేశారు హరీష్ రావు.
బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. బీఆర్‌ఎస్‌కు పటిష్టమైన లీగల్ సెల్ ఉందనన్నారు. తప్పుడు కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు కేటీఆర్. అనవసర కేసులను ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సీరియస్‌గా తీసుకుని పోరాడాలన్నారు. కేసుల తీవ్రతను బట్టి రాష్ట్ర నాయకత్వం స్పందిస్తుందన్నారు కేటీఆర్. కేటీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మాట్లాడారు.
Also Read: IND vs AFG 1st T20: దంచికొట్టిన దూబే: ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం