Lok Sabha Elections 2024: మార్చి 12న కరీంనగర్ నుంచి కేసీఆర్ ప్రచారం

మార్చి 12న కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభతో బీఆర్ఎస్ లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. కేసీఆర్ కసెంటిమెంట్ గా భావించే ఈ ప్రదేశం నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాలని పార్టీ నిర్ణయించింది.

Lok Sabha Elections 2024: మార్చి 12న కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభతో బీఆర్ఎస్ లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. కేసీఆర్ కసెంటిమెంట్ గా భావించే ఈ ప్రదేశం నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాలని పార్టీ నిర్ణయించింది.

పార్లమెంటరీ ఎన్నికల కోసం తమ అభ్యర్థుల పేర్లను కేసీఆర్ ఈ రోజు సోమవారం అవకాశం ఉంది.కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ బీ వినోద్ కుమార్ , పెద్దపల్లి నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్లను ఆయన ఇప్పటికే ఖరారు చేసినట్లు సమాచారం . ఆదివారం తెలంగాణ భవన్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కరీంనగర్‌, పెద్దపల్లి నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలతో చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన వచ్చే లోక్‌సభ ఎన్నికల తొలి వ్యూహాత్మక సమావేశం జరిగింది.

లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మెజారిటీ సీట్లు గెలుచుకుంటుందని, కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం నీరు, విద్యుత్ వంటి కనీస అవసరాలను తీర్చడంలో విఫలమైందని, దీంతో రైతులు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారని ఆయన పార్టీ క్యాడర్‌కు తెలియజేసినట్లు తెలిసింది. బీఆర్‌ఎస్‌ పాలనపై విమర్శలు గుప్పించి, లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకంని ఉచితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ దానిని నెరవేర్చడంలో విఫలమైందన్నారు.

కాంగ్రెస్ తన అసమర్థతను ప్రజలు గ్రహించి అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే చెడ్డపేరు తెచ్చుకున్నందున పార్లమెంటు ఎన్నికలు ప్రధానంగా బీఆర్‌ఎస్, బీజేపీ మధ్యే జరుగుతాయని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ మధ్య ఓటింగ్ శాతంలో తేడా కేవలం 1.8 శాతం మాత్రమే. లోకసభలో ఈ తేడాని సులభంగా అధిగమించవచ్చవచ్చని పార్టీ భావిస్తుంది. రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టేందుకు, ప్రజలకు చేరువయ్యేందుకు పార్టీ నేతలు ఐక్యంగా కృషి చేయాలి అని కేసీఆర్ క్యాడర్ కు వివరించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌పై తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ ముఖ్యమంత్రి మండిపడ్డారు.కుంగిపోతున్న మేడిగడ్డ పైర్లను సులువుగా సరిచేసుకోవచ్చని, అయితే రాజకీయ మైలేజీ కోసం కాంగ్రెస్ ఈ అంశాన్ని గాలికొదిలేస్తోందని ఆయన పార్టీ నేతలతో అన్నారు. మిడ్ మానేరు వంటి ప్రాజెక్టులకు అవసరమైనప్పుడల్లా బిఆర్‌ఎస్ ప్రభుత్వం మరమ్మతు పనులు చేపట్టిందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ, కాంగ్రెస్‌లు పదే పదే విఫలమయ్యాయని ఆరోపించారు.

లోక్‌సభ ఎన్నికల తొలి వ్యూహాత్మక సమావేశంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు, మాజీ మంత్రులు టీ హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌, కరీంనగర్‌, పెద్దపల్లి నియోజకవర్గాలకు చెందిన సీనియర్‌ నేతలు పాల్గొన్నారు.

Also Read: Life Style: హైట్ తక్కువ అని ఫీల్ అవుతున్నారా.. అయితే టిప్స్ ఫాలోకండి