Site icon HashtagU Telugu

BRS : రేపు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బీఆర్‌ఎస్‌ బృందం

BRS team to visit Kaleswaram project tomorrow

BRS team to visit Kaleswaram project tomorrow

BRS Team: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు(MLAs), ఎమ్మెల్సీల(MLCs) బృందం రేపు కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram project) సందర్శనకు వెళ్లనున్నారు. గురువారం అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రసంగం ముగిసిన వెంటనే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం కాళేశ్వరం బయలుదేరనుంది. ఈ మేరకు వారు అసెంబ్లీ నుండి నేరుగా ప్రత్యేక బస్సులో కాళేశ్వరం వెళ్లి ప్రాజెక్టును సందర్శించనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

పర్యటనలో భాగంగా మొదట ఎల్‌ఎండీ రిజర్వాయర్‌(LMD Reservoir) సందర్శించనున్న బీఆర్‌ఎస్‌ బృందం గురువారం రాత్రి రామగుండంలో బస చేయనుంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు కన్నెపల్లి పంపు హౌజ్ సందర్శిస్తారు. 11 గంటలకు మేడిగడ్డ బ్యారేజ్‌ వద్ద పరిస్థితిని పరిశీలిస్తారు. అనతరం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం హైదరాబాద్‌ తిరిగిరానుంది.

ప్రాజెక్టులన్ని ఖాళీగా ఉన్నప్పటికీ కాళేశ్వరం పంపు హౌస్‌(Kaleswaram Pump House)ల ద్వారా నీళ్లను లిఫ్ట్‌ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు కేసీఆర్‌ ఆదేశాలతో తాము ఈ సందర్శనకు వెళ్లబోతున్నామన్నారు.

Read Also: Relationship Tips : భార్య యొక్క ఈ ప్రవర్తనలు వైవాహిక జీవితం నాశనం కావడానికి కారణం కావచ్చు..!