తెలంగాణ రాజకీయాల్లో మరోసారి రాజకీయ వేడి మొదలైంది . బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ మరియు మాజీ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్(Konatham Dileep)ను శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ (Arrest) చేశారు. తాజాగా అమెరికాలో తన తండ్రి జ్ఞాపకాల పుస్తకావిష్కరణలో పాల్గొని మంగళవారం రాత్రి హైదరాబాద్‌కి వచ్చిన దిలీప్ విమానాశ్రయంలో దిగిన వెంటనే అదుపులోకి తీసుకున్నారు. వెంటనే ఆయనను నిర్మల్ పోలీస్ స్టేషన్‌కు తరలించి, ఎఫ్‌ఐఆర్ నెంబర్ 353 కేసులో అరెస్ట్ చేసినట్లు సమాచారం.
Sakshi Office : ఏలూరు సాక్షి ఆఫీస్ లో ఎలాంటి అగ్ని ప్రమాదం జరగలేదు – డీఎస్పీ క్లారిటీ
దిలీప్‌పై గతంలో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది. గత సంవత్సరం ఆయనపై ‘లుక్ అవుట్ సర్క్యులర్’ సైతం జారీ చేయగా, దానిని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. నెలరోజులపాటు విదేశీ ప్రయాణానికి అనుమతినిస్తూ కోర్టు ఆదేశించినప్పటికీ, తిరిగి వచ్చేసరికి ఆయనను అరెస్ట్ చేయడంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తోంది. ప్రభుత్వం వైఫల్యాలను సోషల్ మీడియాలో ఎండగడుతున్నందుకే రాజకీయ కక్షతో అరెస్ట్ చేశారంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.
Telangana Cabinet : మంత్రుల శాఖల్లో మార్పులు జరగబోతున్నాయా…?
మాజీ మంత్రి హరీష్ రావు ఈ అరెస్ట్‌ను తీవ్రమైన దుర్మార్గ చర్యగా పరిగణించారు. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ప్రభుత్వం వ్యవహరించడాన్ని న్యాయవ్యవస్థకు అవమానంగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పాలనపై నమ్మకం ఉంటే ఇలాంటి చర్యలు అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఒక సామాన్య కార్యకర్తకు ప్రశ్నించే హక్కు లేకపోతే, అది ప్రజాస్వామ్యానికి అర్థంకాదన్నారు. దిలీప్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, ప్రభుత్వం పునరాలోచించాలన్నారు. దీనిపై రాష్ట్ర రాజకీయాల్లో మరిన్ని ప్రకంపనలు తలెత్తే అవకాశం ఉంది.