దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. తెలంగాణతో పాటు ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం రాష్ట్ష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే ..తెలంగాణ ఎన్నికలకు (Assembly Elections) నవంబర్ 3న నోటిఫికేషన్ (Notification) విడుదల కానుంది. అదే రోజు నామినేషన్ల ప్రారంభమవుతాయి.
నామపత్రాల దాఖలుకు నవంబర్ 10 చివరి తేదీకాగా, నామినేషన్ల ఉపసంహరణకు 15వ తేదీ ఆఖరు తేదీ. అదే నెల 13న నామినేషన్లను పరిశీంచనున్నారు. ఇక నవంబర్ 30న పోలింగ్ జరుగనుంది. డిసెంబర్ 3న ఓట్లను లెక్కిస్తారు. అదేరోజున ఫలితాలను ప్రకటిస్తారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (CEC) రాజీవ్ కుమార్ షెడ్యూల్ విడుదల చేశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన రావడం తో ఈరోజు నుండే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం తో బహిరంగంగా ప్రభుత్వం పథకాలు, ప్రకటనలు ఇవ్వడానికి ఆస్కారం లేదు. కానీ డిజిటల్ మీడియా (Social Media) ద్వారా ప్రకటనలు ఇచ్చే ఆస్కారం ఉండడంతో బీఆర్ఎస్ టెక్నాలజీని విపరీతంగా వాడుకోవాలని చూస్తుంది. వాస్తవానికి బిఆర్ఎస్ ముందు నుండి కూడా సోషల్ మీడియాలను విపరీతంగా వాడుకుంటూ వస్తుంది. కానీ ఇక నుండి ఈ వాడకం మరింత పెంచనుంది. ప్రస్తుతం యువత తో పాటు పెద్దవారు కూడా సోషల్ మీడియా ను ఫాలో అవుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రతి ఒక్క విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటూ..అవగాహనా పెంచుకుంటున్నారు. దీంతో రాజకీయ పార్టీలు సైతం తమ పార్టీ కార్యక్రమాలను , పథకాలను ప్రజలకు చేరవేసేందుకు సోషల్ మీడియా ను వాడుకుంటున్నాయి. ఇక ఇప్పుడు బిఆర్ఎస్ సైతం ప్రజలను ఆకట్టుకోవడానికి వివిధ వీడియోలు, ఇప్పటి వరకు చేపట్టిన పనులను సోషల్ మీడియా ద్వారా పరిచయం చేయబోతున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ లో ఏ వీడియో ఓపెన్ చేసినా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటికే ఓ ప్రముఖ కంపెనీతో ప్రచారానికి సంబంధించిన వీడియోలు తయారు చేసి ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. కేవలం యూట్యూబ్ మాత్రమే కాకుండా ట్విట్టర్, పేటీఎం, ఫేస్ బుక్ ఇలా ఏ సోషల్ మీడియాను వదలకుండా బిఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరోపక్క నియోజకవర్గ అభ్యర్థులు సైతం తమ ప్రచారాన్ని మరింత పెంచేందుకు ప్లాన్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలను జమ చేసే పనిలో పడ్డారు. మొత్తం మీద బిఆర్ఎస్ మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యింది.
Read Also : KCR Hat Trick: కేసీఆర్ హ్యాట్రిక్ గ్యారంటీ: అసదుద్దీన్ ఒవైసీ