Site icon HashtagU Telugu

BRS : గుంపు మేస్త్రి కి స్వ‌దేశాగ‌మ‌న శుభాకాంక్ష‌లు – బిఆర్ఎస్ ట్వీట్

Cm Revanth India

Cm Revanth India

రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులే లక్ష్యంగా కొనసాగిన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పర్యటన (America Tour) ముగిసింది. ఈరోజు రాష్ట్రంలో అడుగుపెట్టబోతున్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ రేవంత్ కు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధం అవుతుండగా..బిఆర్ఎస్ (BRS) మాత్రం సెటైర్లు వేయడం మొదలుపట్టింది. సోషల్ మీడియా వేదికగా “ప‌ది రోజుల అమెరికా ప‌ర్య‌ట‌న‌లో సోద‌రుడు ఎనుముల జ‌గ‌దీశ్ రెడ్డి గారు నూత‌నంగా స్థాపించిన కంపెనీతో రూ. 1000 కోట్ల ఒప్పందం కుదుర్చుకుని నేడు స్వ‌దేశానికి తిరిగి వ‌స్తున్న మా గుంపు మేస్త్రి గారికి స్వ‌దేశాగ‌మ‌న శుభాకాంక్ష‌లు. ఇట్లు బ్యాగ్‌మ్యాన్ ఫ్యాన్స్ అసోసియేష‌న్” అని ఈ బ్యాన‌ర్‌ను ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) లో పోస్ట్ చేసింది. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటె ఆగస్టు 3న సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు బృందం అమెరికాలో విస్తృతంగా పర్యటించారు. వారం రోజుల పాటు అక్కడున్న ప్రముఖ సంస్థల సీఈవోలు, ఇన్వేస్టర్లతో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ పాలసీని వారికి వివరించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా దక్షిణ కొరియాలోను వారి పర్యటన కొనసాగింది. పర్యటనలో భాగంగా మొత్తం రూ.31 వేల కోట్ల పెట్టుబడులను తెలంగాణకు తీసుకురావడంలో సీఎం రేవంత్ బృందం సక్సెస్ అయింది. 19 మల్టీ నేషనల్ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంవోయూలు కూడా చేసుకోవడం శుభ పరిణామం.

Read Also : AP Govt : ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేసిన కూటమి సర్కార్