Site icon HashtagU Telugu

Congress Leaders South Korea : ఈ పిల్ల కాలువను చూడడానికి కొరియా దాకా వెళ్లారా..? బిఆర్ఎస్ సెటైర్లు

Ts Cng Leaders Visits South

Ts Cng Leaders Visits South

మూసీ ప్రాజెక్ట్ నిర్మాణం (Construction of Moosey Project) నేపథ్యంలో సౌత్ కొరియా (South Korea)లో పర్యటిస్తున్న కాంగ్రెస్ బృందం (Congress Team)పై బీఆర్ఎస్ సెటైర్లు (BRS Satires) వేసింది. ‘ఈ పిల్ల కాలువను చూడడానికి కొరియా దాకా వెళ్లారా? ప్రజల సొమ్ముతో జల్సాలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు’ అని ఆరోపించింది. సియోల్లోని ఓ నదిని కాంగ్రెస్ నేతల బృందం పరిశీలిస్తున్న వీడియోను Xలో పోస్ట్ చేసింది.

మూసీ పునరుజ్జీవంపై అధ్యయనానికి తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు దక్షిణ కొరియా రాజధాని సియోల్‌ పర్యటనకు వెళ్లడం జరిగింది.ఈరోజు (అక్టోబర్ 21) నుంచి 24 వరకు వారు సియోల్‌లో పర్యటిస్తారు. చెంగిచియాన్ నది సందర్శన,రివర్ ఫ్రంట్ అధికారులతో చర్చలు,చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే వనరుల పునర్వినియోగ కేంద్రాన్ని సందర్శించారు. పర్యావరణం పై దుష్ప్రభావం పడకుండా నగర వ్యర్థాలను పునర్వినియోగం లోకి తెచ్చే అద్భుత సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో ఉంది. మరో 10 ఏళ్లలో పూర్తిగా భూ ఉపరితలం నుండి తొలగించి భూగర్భంలో అతిపెద్ద ప్లాంట్ ను నిర్మించబోతుంది సియోల్ నగర పాలక్ సంస్థ.

ఈ పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి,ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి , హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి , డిప్యూటీ మేయర్ శ్రీలత,ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగా రెడ్డి, కాలే యాదయ్య, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్,GHMC , మూసి రివర్ ప్రంట్ అధికారులు, తదితరులు వెళ్లడం జరిగింది. వీరంతా సియోల్‌లో రివర్ ఫ్రంట్ అభివృద్ధిని క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఈ పర్యటన ఫై బిఆర్ఎస్ సెటైర్లు వేసింది. ‘ఈ పిల్ల కాలువను చూడడానికి కొరియా దాకా వెళ్లారా? ప్రజల సొమ్ముతో జల్సాలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు’ అని ఆరోపించింది.

Read Also : Amit Shah : ఇంకా ఉగ్రవాదంపై యుద్ధం ముగియలేదు: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా