BRS Raging : `వందే భార‌త్`ను గేదెల‌తో నిర‌స‌న‌ గోకుడు

మోడీ హైద‌రాబాద్ రాక సంద‌ర్భంగా వినూత్న నిర‌స‌న‌ల‌కు బీఆర్ఎస్ (BRS Raging) తెర‌లేపింది.

  • Written By:
  • Publish Date - April 8, 2023 / 12:43 PM IST

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ హైద‌రాబాద్ రాక సంద‌ర్భంగా వినూత్న నిర‌స‌న‌ల‌కు బీఆర్ఎస్ (BRS Raging) తెర‌లేపింది. దేశంలో ఇత‌ర ప్రాంతాల్లో ఎక్క‌డాలేని విధంగా వందే భార‌త్ రైలు(Vandebharat rail)కు అడ్డు రావ‌ద్దంటూ గేదెల‌కు ప్ల కార్డులు వేలాడ‌దీసి నిర‌స‌న తెల‌ప‌డం హైలెట్‌. అంతేకాదు, గ‌త రెండు రోజులుగా న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో హోర్డింగ్ ల‌తో ఆదానీ ప‌రివార్ అంటూ మోడీని ఒక రకంగా తారాస్థాయిలో బీఆర్ఎస్ ర్యాగింగ్ చేసింది. ప్ర‌తిగా మోడీ స‌భా వేదిక‌పై సీఎం కేసీఆర్ కు కుర్చీ వేయ‌డం ద్వారా బీజేపీ గాంధీయ‌మార్గంలో ర్యాగింగ్ ను ఎంచుకుంది.

వినూత్న నిర‌స‌న‌ల‌కు బీఆర్ఎస్ (BRS Raging)

తెలంగాణ ప‌ర్య‌ట‌నకు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వ‌చ్చిన సంద‌ర్భంగా ఇటీవ‌ల కేసీఆర్ దూరంగా (BRS Raging) ఉంటున్నారు. క‌రోనా స‌మ‌యంలో భార‌త్ బ‌యో టెక్ కు మోడీ వ‌చ్చిన సంద‌ర్భంగా ప్రోటోకాల్ మిస్ అయిందట‌. ఆ విష‌యాన్ని బీఆర్ఎస్ లీడ‌ర్ వినోద్ శుక్ర‌వారం ప్ర‌క‌టించారు. ఆ రోజున జ‌రిగిన అవ‌మానం కార‌ణంగా ఎప్పుడు మోడీ తెలంగాణ‌కు వ‌చ్చిన‌ప్ప‌టికీ కేసీఆర్ దూరంగా ఉంటున్నార‌ని వినోద్ చెప్పారు. అంతేకాదు, వ‌స్తాన‌న్నా కేసీఆర్ ను పీఎంవో ఆఫీస్ వ‌ద్ద‌ని చెప్పింద‌ని వివ‌రించారు.

మంత్రి శ్రీనివాస్ యాద‌వ్ ప్ర‌ధాని మోడీకి ఆహ్వానం

వాస్తవంగా ముచ్చింత‌ల్ రామానుచార్యుల విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ సంద‌ర్భంగా ప్రొటోకాల్ వివాదం మోడీ, కేసీఆర్ మ‌ధ్య నెల‌కొంది. విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ సంద‌ర్భంగా ఆక‌స్మాత్తుగా శిలాఫ‌ల‌కంపై కేసీఆర్ పేరు తొలగించారు. ఆ రోజు నుంచి ముంచింతల్ బాధ్యుల‌కు, కేసీఆర్ కూడా గాప్ వ‌చ్చింది. ఆధ్యాత్మిక‌వేత్త చిన్న‌జియ్య‌ర్ తో కూడా కేసీఆర్ ఆనాటి నుంచి దూరంగా పెడుతూ వ‌స్తున్నారు. ఆ త‌రువాత మోడీ ఐఎస్ బీ ఉత్స‌వాల‌కు హైద‌రాబాద్ వ‌చ్చారు. అప్పుడు మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ వెయిటింగ్ మంత్రిగా మోడీని ఆహ్వానించారు. ఎప్పుడు తెలంగాణ‌కు మోడీ వ‌చ్చిన‌ప్ప‌టికీ రెండేళ్లుగా మంత్రి శ్రీనివాస్ యాద‌వ్ ప్ర‌ధాని మోడీకి ఆహ్వానం ప‌లుకుతున్నారు. ఇప్పుడు కూడా శ్రీనివాస్ యాద‌వ్ ప్ర‌ధానికి స్వాగ‌తం ప‌లికారు.

గో బ్యాక్ మోడీ బ్యాన‌ల‌ర్లు(BRS Raging) 

బేగంపేట విమానాశ్ర‌యం వ‌ద్ద ప్రొటోకాల్ ప్ర‌కారం తొలుత గ‌వ‌ర్న‌ర్, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, మంత్రి శ్రీనివాస్ యాద‌వ్ , బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజ‌య్ త‌దిత‌రులు ప్ర‌ధాని మోడీకి స్వాగ‌తం ప‌లికారు. ఆ త‌రువాత నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ కు వెళ్లి సికింద్రాబాద్-తిరుప‌తి వందేభార‌త్ (Vandebharat)ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించారు. సుమారు 11వేల కోట్ల రూపాయ‌ల విలువైన సికింద్రాబాద్ రైల్వే ఆధునీక‌ర‌ణ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. ఆయ‌న రాక‌ను నిర‌సిస్తూ బీఆర్ఎస్ ప‌లు విధాలుగా కార్య‌క్ర‌మాలను రూపొందించింది. ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో కొన్ని చోట్ల హోర్డింగ్ ల ద్వారా గో బ్యాక్ మోడీ బ్యాన‌ల‌ర్లు(BRS Raging) క‌ట్టారు. సింగ‌రేణి ప్రైవేటీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తూ మ‌హాధ‌ర్నాకు బీఆర్ఎస్ పూనుకుంది.

Also Read : KCR : కేసుకు కేసు-అరెస్ట్ కు అరెస్ట్! సింహ‌స్వ‌ప్నంలా కేసీఆర్ !!

బీజేపీ నేత‌ల అరెస్ట్ ల ప‌ర్వం చ‌ల్లార‌క ముందే ప్ర‌ధాని మోడీ హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. దీంతో రాజ‌కీయ వేడి అడుగ‌డుగునా క‌నిపించింది. నిర‌స‌న‌ల‌ను వినూత్నంగా తెలుపుతూ బీఆర్ ఎస్ తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో రుచిచూపించారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ గోకుడు (BRS Raging) ఎలా ఉంటుందో ఢిల్లీ వ‌ర‌కు తెలియ‌చేయ‌డంలో బీఆర్ఎస్ స‌క్సెస్ అయింది.

Also Read : KCR Strategy : TSPSC పాయే..టెన్త్ వ‌చ్చే.!వావ్ కేసీఆర్!

వందేభారత్ రైలు ప్రారంభోత్సవంపై టీఎస్‌ఆర్‌ఈడీకో చైర్మన్‌ సతీష్‌రెడ్డి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వందే భారత్ రైలు భద్రత గురించి సతీష్ రెడ్డి ఆందోళన చెందారు. సుమారు 68 ప్రమాదాలలో చిక్కుకుంది. ఎద్దులు మరియు ఆవులను ఢీకొనడంతో రైలు దెబ్బతింది. భద్రతా ప్రమాణాలపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వందే భారత్ రైలు దగ్గరకు వెళ్లవద్దని హెచ్చరిస్తూ, జాగ్రత్త వహించాలని ఆయ‌న‌ గేదెల సంఘానికి విజ్ఞప్తి చేశారు. దేశంలో బుల్లెట్ రైళ్లను నడపాలని మోదీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నప్పటికీ, బలహీనంగా, బలహీనంగా కనిపిస్తున్న వందే భారత్ లాంటి రైలును ప్రవేశపెట్టారని విమర్శించారు.