Site icon HashtagU Telugu

KCR : కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రంలో 5 గంటల క‌రెంటే – కేసీఆర్

Brs Public Meeting In Tandu

Brs Public Meeting In Tandu

గులాబీ బాస్ కేసీఆర్ (KCR) ఎన్నికల ప్రచారం(KCR Election Campaign) లో తన దూకుడును మరింత పెంచారు. ప్రజా ఆశీర్వద సభల పేరుతో ప్రతి రోజు మూడు , నాల్గు నియోజకవర్గాలను కవర్ చేస్తూ మరోసారి బిఆర్ఎస్ కు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతూ..కాంగ్రెస్ హామీలపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మొదటి నుండి కూడా కేసీఆర్ ఎక్కడికెళ్లినా కర్ణాటక కరెంట్ , ధరణి ఎత్తేయడం , అభివృద్ధి శూన్యం వంటి అంశాలను ఎత్తిచూపుతూ ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వెయ్యొద్దని కోరుతున్నారు.

ఈరోజు తాండూరు నియోజ‌క‌వ‌ర్గం (BRS Public Meeting In Tandur)లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కూడా అలాంటి విమర్శలే చేశారు. క‌ర్ణాట‌క ప్ర‌జ‌లు, రైతులు కాంగ్రెస్ (Congress) పార్టీని గెలిపిస్తే.. ఐదు గంట‌ల క‌రెంటే ఇస్తున్నారు.. తెలంగాణ‌లో కూడా కాంగ్రెస్‌కు ఓటేస్తే మ‌న గ‌తి కూడా అంతే అయిత‌ది చెప్పుకొచ్చారు. తాండూరు లో రోహిత్ రెడ్డి గెలిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి అవుతుందని , రైతు బంధు 10 వేల‌నుంచి 16 వేల‌కు పోతదని తెలిపారు. రోహిత్ రెడ్డి నిజాయితీప‌రుడు.. ఆయ‌న కోరిన కోరిక‌ల‌న్నీ త‌ప్ప‌కుండా నెర‌వేర్చి, ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని మ‌రింత అభివృద్ధి చేస్తామ‌ని హామీ ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

బీజేపీ వాళ్లు వ‌చ్చి మ‌న ప్ర‌భుత్వాన్ని కూల‌గొట్టాల‌ని కుట్ర చేస్తే వాళ్ల‌ను ప‌ట్టించి జైల్లో వేయించారు. బ్ర‌హ్మాండ‌మైన ప‌ని చేసిండు. నిజాయితీకి నిల‌బ‌డ్డాడు. ఆయ‌న అడిగింది ఏది కాద‌న‌కుండా మంజూరు చేస్తున్నాను. ఆయ‌న వ్య‌క్తిగ‌తంగా ఏది అడ‌గ‌లేదు. తాండూరు వెనుక‌బ‌డ్డ ప్రాంతం. బోర్డ‌ర్‌లో ఉండే ప్రాంతం. నాకు బాగా తెలుసు. త‌ప్ప‌కుండా పాలిటెక్నిక్ కాలేజీతో పాటు మిగ‌తావి కూడా ఇచ్చేద్దాం. త‌ప్ప‌కుండా మంజూరు చేస్తాను అవేమీ గొంతెమ్మ కోరిక‌లు కావు. ఢిల్లీ నుంచి తెచ్చేటివి కావు. హైద‌రాబాద్‌లో చేసే ప‌ని కాబ్ట‌టి నూటికి నూరు శాతం నెర‌వేరుస్తాను అని కేసీఆర్ హామీ ఇచ్చారు.

క‌త్తి ఒక‌రికి ఇచ్చియుద్ధం ఇంకొక‌రిని చేయ‌మంటే ధ‌ర్మం కాదు క‌దా..? రైతుల ప‌క్షాన‌, ప్ర‌జ‌ల ప‌క్షాన ఉండే వారి చేతిలో క‌త్తి పెడితేనే వాళ్లు మిమ్మ‌ల్ని కాపాడుతారు. 24 గంట‌ల క‌రెంట్ ఉంట‌ది రోహిత్ రెడ్డి గెలిస్తేనే లేదంటే క‌రెంట్ ఆగ‌మైపోత‌ది. కాబ‌ట్టి మీరు రోహిత్‌కు ఓటేయాలి. కాంగ్రెసోళ్లు. వీఆర్వోల రాజ్యం, ప్ర‌భుత్వం చేతిలో రైతుల బ‌తుకు ఉండే. ఇప్పుడు మీ బొట‌న‌వేలు పెడితేనే భూ య‌జ‌మాన్యం మారుత‌ది. ముఖ్య‌మంత్రికి కూడా ఆ అధికారం లేదు. ప్ర‌భుత్వం మీకు ధార‌పోసిన ఆ అధికారాన్నిపొడ‌గొట్టుకుంటారా..? కాపాడుకుంటారా..? అనేది మీరే నిర్ణ‌యించుకోవాలి అని కేసీఆర్ సూచించారు.

Read Also : TTDP: టీటీడీపీ అధ్యక్ష పదవీ కోసం తెలుగు తమ్ముళ్ల లాబీయింగ్