KCR : ఏప్రిల్ 15 న మెదక్ లో కేసీఆర్ భారీ సభ ..

దాదాపుగా లక్షమందితో సభను నిర్వహించాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది

  • Written By:
  • Publish Date - April 3, 2024 / 09:19 PM IST

లోక్ సభ (LokSabha) ఎన్నికలకు బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) సిద్ధం అవుతున్నారు. ఈ నెల 15 న మెదక్ (Medak) లో భారీ సభ నిర్వహించి..ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి (Venkatram Reddy) బరిలో నిలువగా.. కాంగ్రెస్ నుంచి నీలం మధు (Neelam Madhu), బిజెపి నుండి రఘునందన్ రావు (Raghunandan Rao
) లు బరిలో ఉన్నారు. దీంతో ఈస్థానం ఫై ఆసక్తి నెలకొంది.

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణ లో 17 లోక్ సభ స్థానాలకు గాను మే 13 న ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో అధికార పార్టీ కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష పార్టీలు తమ ప్రచారాన్ని మొదలుపెట్టాయి. అయితే బిఆర్ఎస్ మాత్రం మునపటి దూకుడు కనపరచలేకపోతుంది. దీనికి కారణాలు చాల ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమి చెందడం..ఆ తర్వాత నుండి వరుస పెట్టి నేతలు పార్టీని వీడడం, మరోపక్క కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అవ్వడం ఇవన్నీ కూడా పార్టీని కుదేల్ చేసాయి. పార్టీలో ఎవరు ఎప్పుడు పార్టీ మారతారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. అంతే ఎందుకు కాంగ్రెస్ హావ దాడికి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి కూడా చాలామంది వెనుకడుగు వేస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎలాగైనా పార్టీని గెలిపించి, ప్రజల్లో నమ్మకం పెంచుకోవాలని కేసీఆర్ చూస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ఫై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఇక మెదక్ సభ లో ఎలాంటి విమర్శలు చేస్తారో చూడాలి. దాదాపుగా లక్షమందితో సభను నిర్వహించాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. మెదక్ పార్లమెంట్ స్థానంపై మొదటినుంచి బీఆర్ఎస్ కు మంచి పట్టుంది. 2009 నుంచి ఇక్కడి బీఆర్ఎస్ గెలుస్తూ వస్తుంది. 2014, 2019లో ఇక్కడి నుండి ఎంపీగా గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు ఇక్కడి నుంచి బీఆర్ఎస్ సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని బరిలోకి దించింది బీఆర్ఎస్. మరి గెలుపు ఎవర్ని వరిస్తుందో చూడాలి.

Read Also : Tibetan Singing Bowls : టిబెటన్ సింగింగ్ బౌల్స్ గురించి విన్నారా? అనేక ఆరోగ్య సమస్యలు తీరుస్తాయి..