BRS Public Meeting : ఈ నెల 12న కరీంనగర్లో బీఆర్ఎస్ బహిరంగ సభ

  • Written By:
  • Publish Date - March 3, 2024 / 06:44 PM IST

లోక్ సభ (Lok Sabha) ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ (BRS-BJP) మధ్య పోటీ అని , కరీంనగర్ లో ఈ నెల 12 భారీ బహిరంగ సభ (BRS Public Meeting) నిర్వహించబోతున్నట్లు ఈరోజు తెలంగాణ భవన్‌లో కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ నేతలతో జరిగిన సమావేశంలో కేసీఆర్ (KCR) చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో భాగంగా ఈ నెల 12న సెంటిమెంట్‌గా వస్తున్న కరీంనగర్ లోని ఎస్సారార్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో సభ నిర్వహించనున్నట్లు కేసీఆర్ తెలిపారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ స్థానంలో బీఆర్‌ఎస్‌ గెలవబోతున్నట్లు ధీమా వ్యక్తం చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

ఎన్నికల కోసం భాగంగా రోడ్‌షోలు నిర్వహించాలని , ఇందులో ఆయన స్వయంగా పాల్గొనున్నట్లు కేసీఆర్ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య పోటీ ఉంటుందని , మండల స్థాయిలోనూ పార్టీ సమావేశాలు పెట్టాలని నేతలకు సూచించారు. బస్సు యాత్రలు చేద్దామని నేతలకు కేసీఆర్‌ పిలుపునిచ్చారు. అతికొద్ది రోజుల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందన్నారు. రైతులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందన్న ఆయన.. బీఆర్‌ఎస్‌తో మేలు జరుగుతుందనే చర్చ మొదలైందన్నారు.

శాసన సభ ఎన్నికల ఫలితాలు పట్టించుకోవద్దని శ్రేణులకు సూచించారు. నేతలు, కార్యకర్తలు అధైర్యపడొద్దని సూచించారు. నేతలంతా కలిసి పని చేయాలని సూచించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ విషయంలో గతంలో బీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌ విమర్శించిందని గుర్తు చేసిన కేటీఆర్‌.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్‌ చేస్తామని మాట ఇచ్చిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉచితంగా చేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు నీళ్లు, కరెంటు ఇవ్వడం లేదని విమర్శించారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ నేతలతో భేటీ అనంతరం కేసీఆర్‌.. పెద్దపల్లి నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు.

Read Also : Pavithranath Death : మొగలి రేకులు ఫేమ్ పవిత్రనాథ్ మృతికి కారణాలివే..!!