Site icon HashtagU Telugu

BRS Public Meeting At Madhira : కాంగ్రెస్ పార్టీ కి 20 సీట్లు కూడా కష్టమే – కేసీఆర్

Kcr Madhira

Kcr Madhira

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Elections 2023) 80 నుండి 85 సీట్లు గెలవబోతున్నామని కాంగ్రెస్ (Congress) నేతలు ధీమా వ్యక్తం చేస్తుంటే..బిఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (KCR) మాత్రం 20 సీట్లు కూడా కష్టమే అని అన్నారు. గత కొద్దీ రోజులుగా ప్రజా ఆశీర్వద సభ (Praja Ashirvada Sabha) ల పేరుతో కేసీఆర్ అన్ని నియోజకవర్గాలను కవర్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు మధిర (Madhira ) లో భారీ సభ నిర్వహించి భట్టి ఫై విమర్శల వర్షం కురిపించారు.

పదేళ్ల బిఆర్ఎస్ పాలన లో రాష్ట్రం ఎంతో అభివృద్ధి జరిగిందని , 24 గంటల కరెంట్ తో రాష్ట్రం వెలిగిపోతుందని, రైతుబంధు , దళిత బంధు, బీసీ బంద్ , రైతు భీమా , ఆసరా పెన్షన్లు ఇలా అన్నింటితో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని..అలాంటి ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేసి నష్టపోవద్దని , కాంగ్రెస్ వస్తే మళ్లీ రాష్ట్రం చీకట్లోకి వెళ్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్‌ నేతలు రైతుబంధు వేస్ట్‌ అంటున్నరని, 24 గంటల కరెంటు అవసరమే లేదని చెప్తున్నరని, ధరణి పోర్టల్‌ తీసి బంగాళాఖాతంల పడేసి దాని స్థానంల భూమాత తెస్తమంటున్నరని, ఇన్ని తల్కాయలేని మాటలు మాట్లాడుతున్న కాంగ్రెస్‌ నేతలను నమ్మి ఓటేస్తే మోసపోతరని కేసీఆర్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ చ‌రిత్ర మొత్తం మోసాల చ‌రిత్ర‌.. అలాంటి పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

50 ఏండ్ల కాంగ్రెస్ పాల‌న‌లో పేద‌లు, ద‌ళితుల బ‌తుకు ఎలా ఉండే. రైతుల స‌మ‌స్య‌లు ఎలా ఉండేనో ఆలోచించాలి. నేను ఎమ్మెల్యేగా ఉన్న స‌మ‌యంలో బోడేపుడి వెంక‌టేశ్వ‌ర్ రావు మ‌ధిర ఎమ్మెల్యేగా ఉండే. వ‌రి కంకులు తీసుకొచ్చి చూపించేవారు. మ‌ధిర‌కు నీళ్లు లేక పంట‌లు ఎండిపోతున్నాయ‌ని నిర‌స‌న వ్య‌క్తం చేసేవారు. కాంగ్రెస్ హ‌యాంలో అసెంబ్లీలో కందీళ్లు, కిరోసిన్ బుడ్లు కరెంట్ వ‌స్త‌లేద‌ని, ఎండిపోయిన వ‌రి కంకులు ప‌ట్టుకుని రావ‌డం. ఇదంతా మీరు చూశారు. కానీ ప‌దేండ్ల‌లో ఎక్క‌డ కూడా ఎక‌ర‌ పొలం ఎండ‌లేదు. 24 గంట‌ల క‌రెంట్ వ‌స్తుంది. ఆయ‌క‌ట్టుకు నీళ్లు వ‌స్తున్నాయి. రాష్ట్రమంతా వ్య‌వ‌సాయం పండుగ‌లా మారింది. ఈ విష‌యాల‌ను ఆలోచించాలి అని కేసీఆర్ సూచించారు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 20 సీట్లు కూడా రావని అన్నారు. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అందులో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని అన్నారు. దళితులను కాంగ్రెస్ ఓటు బ్యాంకు గానే వాడుకుందని.. వారి అభివృద్ధి కోసం ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదని విమర్శించారు. భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి అయ్యేది లేదని తేల్చి చెప్పారు. మ‌ధిర‌ చైత‌న్యంవంత‌మైన ప్రాంతం.. మీరంతా ఆలోచించాలి. గ‌తంలో మ‌ధిర‌లో బీఆర్ఎస్ పార్టీని రెండు సార్లు గెలిపించ‌లేదు. అయినా మీ మీద అల‌గ‌లేదు. ఎందుకంటే ఈ మ‌ధిర‌ నాది. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఇంచు అయినా కేసీఆర్‌దే. ప్ర‌తి ఇంచు బాగు ప‌డాల్సిందే. ఎక్క‌డ ధాన్యం పెరిగినా, ఎక్క‌డ ప‌ది మంది ముఖాలు తెల్ల‌వ‌డ్డ నాకు గ‌ర్వ‌మే క‌దా..? రాష్ట్ర నాయ‌క‌త్వానికి ఉండాల్సిన సోయి క‌దా..? అని కేసీఆర్ పేర్కొన్నారు.

Read Also : KTR – Gorati Venkanna Interview : కేటీఆర్, గోరటి వెంకన్న ఇంటర్వ్యూపై కేసు నమోదు