Congress guarantees : కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చి రేపటికి 420 రోజులవుతుంది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని బీఆర్ఎస్ రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చింది. రేపు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులు అర్పిస్తూ.. ఆయా చోట్ల గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు ఇవ్వనున్నారు. దీంతో అయిన రేవంత్ సర్కార్ కళ్లు తెరుచుకుంటాయని ఆశిస్తున్నాట్లు బీఆర్‌ఎస్ పార్టీ తెలిపింది. ఈ నేపథ్యంలో రేపు బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలు, ఆ పార్టీ శ్రేణులు వినూత్న రీతిలో నిరసనలు, ధర్నాలకు దిగాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాయిలాగా ఉందని, ప్రజా సమస్యలపై ఎన్నిసార్లు తెలిపినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అందుకే విగ్రహాలకు వినతి పత్రాలు ఇస్తున్నామని ఆ పార్టీ వెల్లడించింది. దీంతో అయినా కాంగ్రెస్ నాయకులకు, ఆ పార్టీకి కళ్ళు తెరుచుకోవాలని ఆశిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చింది. కానీ ఆ హామీలు ఇప్పటివరకు నెరవేర్చలేదనే బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తోంది. ముఖ్యంగా, రైతులకు, యువతకు, బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన హామీలపై కేంద్రంగా బీఆర్‌ఎస్ నిరసనలు తీసుకురానుంది.
మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగా ఆరు గ్యారెంటీ పథకాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఖమ్మం రూరల్ మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. వృద్ధాప్య పింఛన్ రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేల చొప్పున చెల్లిస్తామని చెప్పి దానిని విస్మరించిం దన్నారు. సొంత జాగా ఉన్న వారికి ఇందిరమ్మ ఇంటి కోసం రూ.5 లక్షలు, రైతు భరోసా పథకం ద్వారా రూ.15 వేలు, అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Read Also: Minister Seethakkka: మాజీ మంత్రి కేటీఆర్‌కు మంత్రి సీతక్క వార్నింగ్!