బిఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. సెక్రటేరియట్ ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై బీఆర్ఎస్ రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు సిద్ధమైంది. తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చింది. మరికాసేపట్లో (september 16) డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం (BR Ambedkar Secretariat) ముందు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని (Rajiv Gandhi Statue) ఆవిష్కరించబోతున్నారు సీఎం రేవంత్ (CM Revanth Reddy). ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ ముఖ్యనేతలు హాజరుకానున్నారు. వాస్తవానికి గత నెల 20న రాజీవ్‌గాంధీ జయంతి రోజు సోనియాగాంధీ, రాహుల్ చేతుల మీదుగా ప్రారంభించాలని రేవంత్ సర్కార్ ప్లాన్ చేసింది. కానీ కుదరలేదు. దీంతో ఈరోజు ముహూర్తం ఫిక్స్ చేసారు. కాగా ఈ విగ్రహ ఏర్పాటు పై బిఆర్ఎస్ (BRS) మొదటి నుండి విమర్శలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆ విమర్శలను ఏమాత్రం పట్టించుకోకుండా సీఎం రేవంత్ ఈరోజు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఈ క్రమంలో రేపు బిఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చింది.
ఇక సచివాలయం ఎదుట ఆవిష్కరించబోయే రాజీవ్ గాంధీ విగ్రహంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. రాజీవ్ గాంధీ ఏ కార్యక్రమానికి వెళ్లినా.. పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఎంతో ఆదర అభిమానాలు చూపించేవారు. ఎదురు వచ్చి పూలమాలలు వేసి తమ అభిమానాన్ని చాటుకునేవారు. వేదిక పైనా ఆయనకు పూలమాలలు వేసి సత్కరించేవారు. కానీ, రాజీవ్ గాంధీ ఆ పూలమాలలను మెడలో ఉంచుకునేవారు కాదు. ప్రజలు చూపించిన ఆ అభిమానాన్ని తిరిగి వారిపైనా కురిపించేవారు. ఇందులో భాగంగా ఆయన ఆ పూల మాలలను తిరిగి అభిమానులు, ప్రజలపైనకు విసిరేసేవారు. అందుకే ఈ విగ్రహం కూడా పూలమాలను ఎదుటి వారి మెడలో పడే విధంగా విసిరేస్తున్నట్టుగా ఉన్నది. ఇలాంటి విగ్రహం ప్రస్తుతం దేశంలో ఎక్కడా లేదు.
Read Also : Gold Mine Dispute: బంగారు గని స్థలం కోసం ఘర్షణ.. 30 మంది మృతి