Telangana : రేపు తెలంగాణ వ్యాప్తంగా బిఆర్ఎస్ నిరసన కార్యక్రమం

ఇప్పటికే రైతుబంధు ఇవ్వక, రైతు భరోసా ఇవ్వకుండా రైతాంగాన్ని అన్నిరకాలుగా కాంగ్రెస్‌ పార్టీ మోసం చేస్తూ వస్తుంది. ఇక ఇప్పుడు ఇలా మాట మార్చి మరోసారి రైతులను మోసం చేసిందని..ఇందుకు గాను రాష్ట్రవ్యాప్తంగా రేపు బిఆర్ఎస్ శ్రేణులు , రైతులు నిరసన చేపట్టాలని’ కేసీఆర్ పిలుపునిచ్చారు.

  • Written By:
  • Publish Date - May 15, 2024 / 10:49 PM IST

రేపు తెలంగాణ వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టబోతుంది. మొన్నటి వరకు లోక్ సభ ఎన్నికలు పూర్తి కాగానే వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లిస్తానని చెప్పిన కాంగ్రెస్..ఇప్పుడు కేవలం సన్న దాన్యానికి మాత్రమే చెల్లిస్తానడం ఫై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇది తెలంగాణ రైతాంగాన్ని వంచించడం, మోసం చేయడమే అవుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. రైతువ్యతిరేక విధానాలను ఖండిస్తున్నామని కేసీఆర్ తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణలో 90 శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారని .. ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇలా వ్యవహరించడం ఫై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ ముగియగానే కాంగ్రెస్ వాళ్లకు రైతుల అవసరం తీరిందని విమర్శించారు. సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని ఎన్నికల ముందు చెపితే కాంగ్రెస్ పార్టీని రైతులు తుక్కుతుక్కు చేసేవాళ్లు. కానీ ఇప్పుడు ఎన్నికలు పూర్తి కాగానే ఆ మాట చెపుతుందని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

ఇప్పటికే రైతుబంధు ఇవ్వక, రైతు భరోసా ఇవ్వకుండా రైతాంగాన్ని అన్నిరకాలుగా కాంగ్రెస్‌ పార్టీ మోసం చేస్తూ వస్తుంది. ఇక ఇప్పుడు ఇలా మాట మార్చి మరోసారి రైతులను మోసం చేసిందని..ఇందుకు గాను రాష్ట్రవ్యాప్తంగా రేపు బిఆర్ఎస్ శ్రేణులు , రైతులు నిరసన చేపట్టాలని’ కేసీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తలు రైతులపక్షాన నిలబడి కొట్లాడాలని పిలుపునిచ్చారు. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో వడ్లను కొనడానికి నిర్లక్ష్యం వహిస్తూ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఏడిపిస్తూ గోస పుచ్చుకుంటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also : KCR-KTR: ఖమ్మం మాజీ DCMS ఛైర్మన్ మృతి.. కేసీఆర్, కేటీఆర్ సంతాపం

Follow us