BRS : రేపు ‘స్వేద‌ప‌త్రం’ పేరిట ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌కు బీఆర్ఎస్ సిద్ధం

పదేళ్ల కేసీఆర్‌ (KCR) పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ప్రజలకు చెపుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం (Congress Govy) శ్వేత పత్రాన్ని (Swetha Patram) విడుదల చేయగా..తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యయనం అంటూ ప్రజలకు తెలియజేసేందుకు బిఆర్ఎస్ (BRS) ‘స్వేద‌ప‌త్రం’ పేరిట ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌ (Power Point Presentation) చేయబోతుంది. తెలంగాణ భ‌వ‌న్‌లో శ‌నివారం ఉద‌యం 11 గంట‌ల‌కు పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇవ్వ‌నున్న‌ట్లు […]

Published By: HashtagU Telugu Desk
Telangana

Telangana

పదేళ్ల కేసీఆర్‌ (KCR) పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ప్రజలకు చెపుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం (Congress Govy) శ్వేత పత్రాన్ని (Swetha Patram) విడుదల చేయగా..తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యయనం అంటూ ప్రజలకు తెలియజేసేందుకు బిఆర్ఎస్ (BRS) ‘స్వేద‌ప‌త్రం’ పేరిట ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌ (Power Point Presentation) చేయబోతుంది. తెలంగాణ భ‌వ‌న్‌లో శ‌నివారం ఉద‌యం 11 గంట‌ల‌కు పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇవ్వ‌నున్న‌ట్లు ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు.

We’re now on WhatsApp. Click to Join.

తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయమని, పగలూ రాత్రి తేడా లేకుండా రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్ఠను దెబ్బతీస్తే సహించేది లేదని కేటీఆర్ హెచ్చరించారు. బీఆర్ఎస్ పాల‌న‌లో తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని వ్యాఖ్యానించారు. ప‌ల్లె ప్ర‌గ‌తి నుంచి మొదలు టీఎస్ ఐపాస్ వ‌ర‌కు ప్ర‌తి ప‌థ‌కం.. అనేక అభివృద్ధి, సంక్షేమ ఫ‌లాల‌ను అందించిందన్నారు. గ‌ణాంకాల‌తో స‌హా.. వాస్త‌వ తెలంగాణ ముఖ‌చిత్రాన్ని వివ‌రిస్తాం. అప్పులు కాదు.. రాష్ట్రం సృష్టించిన సంప‌ద‌ను ఆవిష్క‌రిస్తామ‌ని కేటీఆర్ తెలిపారు.

ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాల రూపురేఖ‌లు మారిపోయాయని , అనేక సంక్షేమ ప‌థ‌కాల‌తో పుట్టిన బిడ్డ నుంచి వృద్ధుల వ‌ర‌కు ఎంతో ప్ర‌యోజ‌నం జరిగిందని, అంత గొప్ప‌గా ప్ర‌జా పాల‌న సాగించిన బీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై ప్ర‌స్తుత కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేస్తున్న విమ‌ర్శ‌ల‌పై వివ‌ర‌ణ ఇచ్చేందుకు బీఆర్ఎస్ సిద్ధమైందని కేటీఆర్ తెలిపారు. మరి ఈ ‘స్వేద‌ప‌త్రం’ పేరిట ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌ ఎలా ఉండబోతుందో ..దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుందో చూడాలి.

Read Also : TS Traffic Challans : పెండింగ్ చ‌లాన్ల‌పై రాయితీ ప్రకటించిన తెలంగాణ సర్కార్

  Last Updated: 22 Dec 2023, 07:34 PM IST