Site icon HashtagU Telugu

BRS ‘Post Card Movement’ : కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ ‘పోస్టు కార్డు ఉద్యమం’

Brs 'post Card Movement'

Brs 'post Card Movement'

BRS ‘Post Card Movement’ : అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్ (BRS)..లోక్ సభ ఎన్నికలతో తమ సత్తా చాటాలని చూస్తుంది. ఇప్పటీకే అభ్యర్థులను ప్రకటించిన గులాబీ బాస్..ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. తాజాగా చేవెళ్ల లో ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఫై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ నాల్గు నెలల్లోనే కుదలైందంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఎన్నికల హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తుందని..హామీలతో ప్రజలను మోసం చేసి అధికారం దక్కించుకుందని కేసీఆర్ (KCR) మండిపడ్డారు. అలాగే బిఆర్ఎస్ నేతలంతా వరుసగా కాంగ్రెస్ వైఫల్యాల గురించి ప్రజలకు తెలిసేలా మాట్లాడుతూ వస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల వైఫల్యాలపై పోస్టు కార్డు ఉద్యమం చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలపై పోస్టు కార్డ్ ఉద్యమం చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర రైతుల పక్షాన సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డులు పంపుతామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, పంటలకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నేరవేర్చాకే పార్లమెంట్ ఎలక్షన్స్‌లో ఓట్లు అడగాలన్నారు. అధికారం చేపట్టిన నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని విమర్శించారు.

Read Also : CM Jagan Attack: ఎయిర్ గన్ తో జగన్ పై ఎటాక్.. సజ్జల అనుమానాలు