BRS Point : అసెంబ్లీలో రేవంత్ ప‌వ‌ర్, చంద్ర‌బాబు క‌ల్చ‌ర్

అమెరికా వేదిక‌గా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన మూడు గంట‌ల ఉచిత విద్యుత్ వ్యాఖ్య‌లు తెలంగాణ అసెంబ్లీని (BRS Point) గంద‌ర‌గోళం చేసింది.

  • Written By:
  • Updated On - August 4, 2023 / 04:56 PM IST

అమెరికా వేదిక‌గా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన మూడు గంట‌ల ఉచిత విద్యుత్ వ్యాఖ్య‌లు తెలంగాణ అసెంబ్లీని (BRS Point) గంద‌ర‌గోళం చేసింది. ఇటీవ‌ల వ‌ర్షాల‌కు వ‌చ్చిన వ‌ర‌ద‌లపై చ‌ర్చ జ‌రుగుతోన్న స‌మ‌యంలో రైతు ప‌క్ష‌పాతి కేసీఆర్ ప్ర‌భుత్వం అంటూ అధికార‌ప‌క్షం చెప్పుకొంది. ఆ క్ర‌మంలో మూడు గంట‌ల ఉచిత విద్యుత్ చాల‌న్న కాంగ్రెస్ చీఫ్ మాట‌ల‌ను కేసీఆర్ ప్ర‌స్తావించారు. ఆ సంద‌ర్భంగా వ్య‌వ‌సాయం దండ‌గ‌ని ఒక పెద్దాయ‌న అన్నారు అంటూ ప‌రోక్షంగా చంద్ర‌బాబును కూడా అసెంబ్లీ ప్ర‌సంగాల్లోకి లాగారు.

రేవంత్ రెడ్డి చేసిన మూడు గంట‌ల ఉచిత విద్యుత్ వ్యాఖ్య‌లు(BRS Point)

ఎన్నిక‌ల వేళ జ‌రుగుతోన్న ఈ స‌మావేశాల‌ను వీలున్నంత వ‌ర‌కు రాజ‌కీయ ల‌బ్ది కోసం ప్ర‌భుత్వం స‌ద్వినియోగం చేసుకుంటోంది. వ‌ర‌ద‌ల కార‌ణంగా జ‌రిగిన న‌ష్టం అపార‌మంటూ కాంగ్రెస్ వాదిస్తోంది. కాదంటూ బీఆర్ఎస్ స‌ర్కార్ చెబుతూ రైతుల‌కు ఇచ్చిన ప‌థ‌కాల గురించి ప్ర‌సంగించారు కేటీఆర్. రైతు బంధు, రైతు రుణ‌మాఫీ, చెక్ డ్యాములు, ధ‌ర‌ణి త‌దిత‌రాల‌న్నీ రైతుల కోస‌మేనంటూ చెప్పుకొచ్చారు. అవ‌న్నీ ఒక ఎత్తైతే, రేవంత్ రెడ్డి చేసిన మూడు గంట‌ల ఉచిత విద్యుత్ ను (BRS Point)వ్యూహాత్మ‌కంగా హైలెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసే ప్ర‌య‌త్నం బీఆర్ఎస్ మంత్రులు ప‌దేప‌దే చేయ‌డం గ‌మ‌నార్హం.

కాంగ్రెస్ పార్టీని కార్న‌ర్ చేయ‌డానికి బీఆర్ఎస్ మంత్రులు 

అమెరికా తానా స‌భ‌ల‌కు వెళ్లిన‌ప్పుడు రేవంత్ రెడ్డి చేసిన ఉచిత విద్యుత్ వ్యాఖ్య‌లు ఇప్ప‌టికీ మంట‌లు రేపుతున్నాయి. రైతు వ్య‌తిరేకి ముద్ర‌ను కాంగ్రెస్ మీద వేయ‌డానికి బీఆర్ఎస్ స‌ర్వ‌శ‌క్తులు అసెంబ్లీ వేదిక‌గా ఒడ్డుతోంది. అంతేకాదు, ఉచిత విద్యుత్ మీద చ‌ర్చ‌కు స‌వాల్ విసిరారు. అందుకు కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ద‌మైయింది. ఉచిత విద్యుత్ మీద అసెంబ్లీ వేదిక‌గా చ‌ర్చ జ‌రిగే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఆ సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీని కార్న‌ర్ చేయ‌డానికి బీఆర్ఎస్ మంత్రులు  (BRS Point) క‌త్తులు దూస్తున్నారు.

చంద్రబాబు వ్య‌వ‌సాయం దండ‌గ   అన్నార‌ని

వాస్త‌వంగా చంద్ర‌బాబు ఎప్పుడూ వ్య‌వ‌సాయ దండ‌గా అన‌లేదు. ఇన్ కెమెరా మీటింగ్ లో అన్ని రంగాల అభివృద్ధి గురించి రివ్యూ చేస్తూ వ్య‌వ‌సాయం కంటే ఐటీ రంగం వైపు మొగ్గుచూపాల‌ని ఆనాడు అన్నారు. ఆ విష‌యాన్ని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ లు చెబుతారు. కానీ, ఆనాడున్న చంద్ర‌బాబు వ్య‌తిరేక మీడియా `వ్య‌వ‌సాయం దండ‌గ‌` అంటూ చంద్ర‌బాబు అభిప్రాయంగా రాసింది. దాన్నే కాంగ్రెస్ పార్టీ గ‌త మూడు ద‌శాబ్దాలుగా హైలెట్ చేస్తూ వ‌చ్చిది. ఆ ముద్ర చెర‌గ‌ని విధంగా ఆయ‌న మీద ప‌డింది. దానికి త‌గిన విధంగా హైటెక్ సీఎం గా చంద్ర‌బాబు గుర్తింపు బ‌డ్డారు. దీంతో మంత్రి కేటీఆర్ కూడా తెలంగాణ అసెంబ్లీలో చంద్రబాబు వ్య‌వ‌సాయం దండ‌గ   అన్నార‌ని చెబుతూ ఆయ‌న శిష్యుడు రేవంత్ ఇప్పుడు ఉచిత విద్యుత్ మూడు గంట‌లు చాలంటున్నార‌ని (BRS Point) విమ‌ర్శ‌ల‌కు దిగారు.

Also Read : BRS Kokapet : 2నెల‌ల్లో KCR సంపాదన 1500 కోట్లు!

అమెరికా వేదిక‌గా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల ప్ర‌కారం తెలంగాణ వ్యాప్తంగా స‌న్న‌, చిన్న‌కారు రైతులు 85శాతం ఉన్నారు. వాళ్ల‌కు మూడు ఎక‌రాల లోపు మాత్ర‌మే భూమి ఉంటుంది. అందుకే, మూడు గంట‌ల విద్యుత్ స‌రిపోతుంద‌ని లెక్క చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. దాని కార‌ణంగా ప్ర‌భుత్వానికి పెద్ద‌గా ఆర్థిక ఇబ్బందులు ఉండ‌వ‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. దాన్ని రాజ‌కీయంగా వాడుకోవ‌డానికి మూడు గంట‌ల ఉచిత విద్యుత్ స‌రిపోతుంద‌ని రేవంత్ రెడ్డి అన్నాడ‌ని బీఆర్ఎస్ హైలెట్ చేసింది. అంత‌కంటే ఎక్కువ‌గా ఎక్క‌డైనా ఉచిత విద్యుత్ ఎనిమిదేళ్ల‌లో కేసీఆర్ స‌ర్కార్ ఇచ్చిందా? అంటే బీఆర్ఎస్ నుంచి స‌మాధానం రాక‌పోవ‌డాన్ని క్షేత్ర‌స్థాయిలో ఇటీవ‌ల జ‌రిగిన ఆందోళ‌న క్ర‌మంలో చూశాం.

Also Read : KCR Powder : BRS,BJP సూత్రం ఇంచుమించు ఒక‌టే..!

ఇటీవ‌ల బీఆర్ఎస్ పార్టీ ట్రాట‌జీని మార్చేసింది. స‌మైక్య‌వాదిగా ఉన్న చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి అంటూ హైలెట్ చేస్తోంది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న మీద చంద్ర‌బాబు నీడ ప‌డుతోంది. దాన్ని తొలి రోజుల్లో మీడియా వేదిక‌గా అంగీక‌రించారు. కానీ, ప్ర‌స్తుతం మారిన రాజ‌కీయ ప‌రిణామాల క్ర‌మంలో చంద్ర‌బాబుతో క‌లిసి ప‌నిచేసిన రాజ‌కీయ‌నాయ‌కుని రేవంత్ రెడ్డి ప్రోజెక్ట్ చేసుకుంటున్నారు.

రాజ‌కీయ స‌హ‌చ‌రునిగా మాత్ర‌మే టీడీపీలో చంద్ర‌బాబుతో ప‌నిచేశాన‌ని చెప్ప‌డం మొద‌లు పెట్టారు. అంతేకాదు, రాహుల్ గాంధీ సహ‌చ‌రునిగా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ప‌నిచేస్తున్నాన‌ని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఎన్నిక‌ల నాటికి చంద్ర‌బాబు ముద్ర‌ను తుడిపేసుకోవ‌డానికి రేవంత్ రెడ్డి ప్ర‌య‌త్నం చేస్తుండ‌గా, బీఆర్ఎస్ మాత్రం చెర‌గ‌కుండా ఆ ముద్ర ఉండేలా స్కెచ్ వేసింది. అందుకే, అసెంబ్లీ వేదిక‌గా గురుశిష్యులు వ్య‌వ‌సాయం మీద ఎలాంటి కామెంట్లు చేశారో గ‌మ‌నించండంటూ మంత్రి కేటీఆర్ ప్ర‌స్తావించ‌డ గ‌మ‌నార్హం.