Site icon HashtagU Telugu

BRS Party: బీఆర్ఎస్ దూకుడు, అభ్యర్థులకు త్వరలో బీఫారాల అందజేత, కేసీఆర్ జిల్లాల పర్యటన

Brs

Brs

BRS Party:  కేంద్రం ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూలను విడుదల చేయడంతో తెలంగాణలో అధికార పార్టీ బీఆర్ఎస్ దూకుడు పెంచింది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన ఆ పార్టీ ప్రత్యక్ష ఎన్నికల రంగంలోకి దిగబోతోంది. బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అక్టోబర్ 15వ తేదీన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో తెలంగాణ భవన్ లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలోనే అభ్యర్థులకు బీఫారాలను అందచేయనున్నారు.  ఈ సందర్భంగా ఎన్నికల్లో పాటించాల్సిన నియమ నిబంధనలు తదితర అంశాలపై అభ్యర్థులకు అధ్యక్షులు సిఎం కేసీఆర్ గారు వివరిస్తారు.  సూచనలు ఇస్తారు. కాగా.. అదే సందర్భంలో బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తారు. అనంతరం అదేరోజు (అక్టోబర్ 15) న హైద్రాబాద్ నుంచి బయలుదేరి హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో  సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ పాల్గొంటారు.

సిఎం కేసీఆర్ జిల్లాల పర్యటనలు :

తెల్లారి…అక్టోబర్ 16 నాడు జనగామ, భువనగిరి నియోజకవర్గాల కేంద్రాల్లో బహిరంగ సభలో సిఎం పాల్గొంటారు.  17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే బహిరంగ సభలో సిఎం కేసీఆర్ గారు పాల్గొంటారు. అక్టోబర్ 18 నాడు.. మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రం లో., అదే రోజు సాయంత్రం 4 గంటలకు మేడ్చల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభల్లో సిఎం పాల్గొంటారు.

సిఎం కేసీఆర్ నామినేషన్లు :

నవంబర్ 9వ తేదీన గజ్వేల్, కామారెడ్డి … రెండు నియోజకవర్గాల నుంచి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారు బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు.  ఇందులో భాగంగా 9వ తేదీ ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి ఆనవాయితీ ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.  అనంతరం గజ్వేల్ లో సిఎం కేసీఆర్ మొదటి నామినేషన్ వేస్తారు.  ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు కామారెడ్డిలో రెండవ నామినేషన్ వేస్తారు. అనంతరం మూడు గంటల నుంచి ప్రారంభమయ్యే కామారెడ్డి బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.

Exit mobile version