MLC Polls: ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ భిన్న స్వరం, కారణమిదే!

  • Written By:
  • Publish Date - January 6, 2024 / 06:57 PM IST

➡️కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్

➡️వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించొద్దు

➡️రెండు వేర్వేరు ఎన్నికలు జరపడం ఎంత వరకు సబబు

➡️రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఒకే ఎన్నిక నిర్వహించాలి

➡️ఒకే నోటిఫికేషన్ ద్వారా ఎన్నిక కాబడ్డ రెండు స్థానాలకు రెండు ఎన్నికలు ఎందుకు

➡️గతంలో ఢిల్లీ, తమిళనాడు లో ఇదే రకమైన పరిస్థితి

➡️ఎన్నికల కమీషన్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి

తెలంగాణ రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల కమీషన్ ఒకే ఎన్నిక నిర్వహించకుండా రెండు ఎన్నికలు నిర్వహించడంలో అంతర్యమేమిటని, రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఇటీవల ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కడియం శ్రీహారి, పాడి కౌశిక్ రెడ్డి .గతంలో 09-11-2021 రోజున ఇద్దరు ఒకే నోటిఫికేషన్ ద్వారా MLC లుగా ఎన్నిక కాబడిన వారని కానీ ఎన్నికల కమీషన్ వీరి స్థానంలో కొత్త వారిని ఎన్నిక చేసేందుకు వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇవ్వడం ఏంటని కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.

బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, హైకోర్టు న్యాయవాది భరత్, ఇతర లీగల్ సెల్ సభ్యులతో కలిసి చర్చించి ఎన్నికల అధికారులకు లిఖితపూర్వకంగా ఒక లేఖ సమర్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు మాట్లాడుతూ , కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి తో పాటు మరో నలుగురు ఒకే నోటిఫికేషన్ ద్వారా ఎమ్మెల్సీలు గా ఎన్నిక కాబడిన జరిగిందని, 03-12-2023 రోజున ఎమ్మెల్యేలుగా ఎన్నికైన తర్వాత ఒకే రోజు రాజీనామా చేసి ఒకే సారి రాజీనామాలు ఆమోదం పొందటం జరిగిందన్నారు.

కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులు రెండు ఎన్నికలు నిర్వహించడం ఎంత వరకు సబబన్నారు. రెండు ఎన్నికలు నిర్వహించడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి లబ్ది చేకూరేలా ఉందని పేర్కొన్నారు. గతంలో ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో ఇలాంటి సందర్భాలు వచ్చాయని, దీనిపై ఎన్నికల కమీషన్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలని పేర్కొన్నారు.

రాష్ట్ర శాసనమండలిలో ఖాళీ అయిన రెండు సీట్లకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎలక్షన్‌ కమిషన్‌ ఇప్పటికే షెడ్యూల్‌ ప్రకటించింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీచేసిన ఇద్దరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డి గెలుపొందారు. దీంతో వీరిద్దరూ శాసనమండలికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వీరి స్థానాలను భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం ఈ నెల 29న పోలింగ్‌ నిర్వహించనుంది. ముందుగా జనవరి 11న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. జనవరి 18న నామినేషన్ల గడవు ముగుస్తుంది. జనవరి 19న నామినేషన్లను పరిశీలించనుండగా.. ఉపసంహరణకు 22వ తేదీని గడవుగా నిర్ణయించారు. పోలింగ్‌ 29న ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగుతుంది. అదే రోజు సాయంత్రం అయిదు గంటల నుంచి ఓట్లను లెక్కించనున్నారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం ఫిబ్రవరి ఒకటో తేదీనాటికి పూర్తిచేయాలని ఎన్నికల సంఘం పేర్కొన్నది.