BRS: బాస్ ఈజ్ బ్యాక్.. కేసీఆర్ తొలి పార్టీ మీటింగ్

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన రేపు శుక్రవారం బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం జరగనుంది. ఎర్రవెల్లిలోని కేసీఆర్ వ్యవసాయక్షేత్రంలో

BRS: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన రేపు శుక్రవారం బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం జరగనుంది. ఎర్రవెల్లిలోని కేసీఆర్ వ్యవసాయక్షేత్రంలో జరుగనున్న ఈ సమావేశానికి లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు హాజరుకానున్నారు. గత ఎన్నికలో ఓటమి తర్వాత కేసీఆర్ నిర్వహించే తొలి మీటింగ్ ఇదే కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షతన శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో జరగనుంది .జనవరి 31 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల కోసం పార్టీ వ్యూహంపై ఈ సమావేశంలో ప్రాథమికంగా దృష్టి సారించనున్నారు. కేసీఆర్ నేతృత్వంలో చర్చలు జరుగుతున్నందున, బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణకు సంబంధించిన కీలక అంశాలను పరిష్కరించేందుకు సమర్థవంతమైన వ్యూహాన్ని రూపొందించాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. బీఆరెస్ ఎంపీ టికెట్లపై కూడా ఈ భేటీలో చర్చ జరగవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.మరోవైపు అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇవే చివరి సమావేశాలు కావడంతో బీఆర్ఎస్ అనుసరించనున్న వ్యూహంపై రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో సీఎం కేసీఆర్ ఎంపీలకు పలు సూచనలివ్వనున్నట్టు తెలుస్తుంది. రాష్ట్ర పున:విభజన అంశాలపై పార్లమెంట్ వేదికగా బీజేపీని ఎండగట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది.

Also Read: Beard : ఏంటి.. గడ్డాన్ని పెంచుకోవడం వల్ల కలిగే లాభాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!