Site icon HashtagU Telugu

BRS Party : ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్ కుమార్

Brs Ex Mp Vinod Kumar Comme

BRS Party : వరికోతలు ప్రారంభమై ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోకి చేరిన కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంలో నిర్లక్ష్యం చేస్తుందని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. చొప్పదండి నియోజకవర్గములోని మాల్యాల మండల కేంద్రంలో వరిధాన్యం కుప్పలను పరిశీలించారు.

ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రైతులకు క్వింటాలుకు ₹500ల భోనస్ ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని…ఇప్పుడు కొనుగోళ్లు చేస్తే రైతులకు భోనస్ ఇవ్వాల్సి వస్తుందనే కారణంతో ఇప్పటి వరకు ధాన్యం కొనుగోళ్లు చేపట్టడం లేదన్నారు. ప్రభుత్వం ఇచ్చే భోనస్ దేవుడెరుగు కానీ…కనీస మద్దతు ధర దక్కడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు.

గ్రామాల్లో రైతులు వరిధాన్యం తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు పోసినప్పటికి ఎప్పుడు కొంటారో తెలియక దళారులకు ₹1800ల ధరకు అమ్ముకుని రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వానికి రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని…రైతులపై ప్రభుత్వానికి ప్రేమ ఉంటే ఇప్పటి వరకు ధాన్యం తరలించడానికి ఎందుకు మిల్లులు అలాట్ మెంట్ చేయలేదని అన్నారు. ప్రభుత్వం ఇప్పుడు కొనుగోళ్లు ఆలస్యం చేస్తే రైతులు విధిలేని పరిస్థితులల్లో దళారులకు అమ్ముకుని నష్టపోతారని…వెంటనే కొనుగోలు కేంద్రాలన ప్రారంబించాలని డిమాండ్ చేశారు. రైతులకు కనీస మద్దతు ధరతో పాటు క్వింటాలుకు ఇస్తామన్న ₹500ల భోనస్ ఇవ్వాలని కోరారు.