Site icon HashtagU Telugu

IPhone : సీఎం రేవంత్ రెడ్డిని చైనా ఫోన్‌తో పోల్చిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

Revanth Reddy Kavitha

Revanth Reddy Kavitha

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. జగిత్యాలలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రేవంత్ రెడ్డిని చైనా ఫోన్‌తో పోల్చారు. ఐఫోన్, చైనా ఫోన్ (iPhone, China Phone) మధ్య ఉన్న తేడా ఎంత ఉందో, కేసీఆర్, రేవంత్ మధ్య కూడా అంతే తేడా ఉందని ఎద్దేవా చేశారు. చైనా ఫోన్ చూడటానికి బాగుండినా, పని చేయడంలో ఫెయిల్ అన్నారు.

Dried Tulsi Plant: ఎండిపోయిన తులసి మొక్కను పడేస్తున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే!

బీసీల హక్కులను కాపాడడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని , బీసీ కుల సంఘాల నేతలతో ప్రత్యక్షంగా సమావేశం కావడం లేదని, బీసీ రిజర్వేషన్ల విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం లేదని విమర్శించారు. 42% రిజర్వేషన్ ఇవ్వకుంటే బీసీ సంఘాలు తీవ్ర ఉద్యమానికి సిద్ధమవుతున్నాయని హెచ్చరించారు. 2014లో కేసీఆర్ హయాంలో బీసీల జనాభా 52% అని లెక్క తేల్చారని, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని కవిత ఆరోపించారు. ఈ లెక్కలను ఆధారంగా చేసుకుని రాహుల్ గాంధీ పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించారని విమర్శించారు. బీసీలకు పూర్తి న్యాయం జరిగేంతవరకు వారు తమ పోరాటాన్ని కొనసాగిస్తారని హెచ్చరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా మారిందని, పంట పొలాలు ఎండిపోయే స్థితికి చేరుకున్నాయని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చినా, వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వమే రాజకీయ కక్షలతో ప్రాజెక్టులను మూసివేస్తోందని మండిపడ్డారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తక్షణమే నీటిని విడుదల చేయాలని, బీసీలకు హామీ ఇచ్చిన విధంగా రిజర్వేషన్లు అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. మహిళలకు రూ.2,500, ఆడపిల్లలకు స్కూటీలు అందిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని విమర్శించారు. ప్రభుత్వం తన మాట నిలబెట్టుకోవాలని, లేదంటే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.