BRS MLC: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోస్టులు దక్కేదెవరికో!

బీఆర్ఎస్ కే మూడు ఎమ్మెల్సీ స్థానాలు వరించడంతో పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది.

  • Written By:
  • Updated On - March 6, 2023 / 01:36 PM IST

ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్ఎస్ కు 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంఐఎం కు 7 కాంగ్రెస కు 5 బీజేపీకి 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. మెజారిటీ సభ్యులు అధికార పార్టీకే ఉండడం వల్ల మిగతా పార్టీలు ఎలాగూ ఈ స్థానాలకు పోటీ చేసే అవకాశం లేదు. దీంతో బీఆర్ఎస్ కే ఈ మూడు స్థానాలు వరించడంతో పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటి వరకు ఎమ్మెల్యే టికెట్ రానివారు పార్టీ కోసం ఎప్పటి నుంచో పనిచేస్తున్నవారు ఈసారి అవకాశం ఇవ్వాలని కొందరు కోరుతున్నారు.

అలాగే మరికొంత మంది అధినేతను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలోని మూడు స్థానాల్లో నవీన్ కుమార్ గంగాధర గౌడ్ ఎలిమినేటి కృష్ణారెడ్డిలు కొనసాగుతున్నారు. వీరి పదవీ కాలం ఈనెల 29తో ముగియనుంది. అయితే ముగ్గురిలో నవీన్ కుమార్ కు మరోసారి అవకాశం ఇస్తారని అంటున్నారు. అయితే మిగతా రెండు స్థానాల్లోనైనా అవకాశం ఇవ్వాలని చాలా మంది ఎదురుచూస్తున్నారు.

వీరిలో ఉద్యమ కాలం నుంచి ఆశించిన పదవీ దక్కని వారు కొందరు నామినేటెడ్ పోస్టులకు పరిమితం అయినవారికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది. అలాగే ఇటీవల బీజేపీ నుంచి టీఆర్ఎస్ కు వచ్చిన దాసోజు శ్రవన్ స్వామి గౌడ్ లు ఛాన్స్ ఇస్తారని మరో ప్రచారం ఉంది. భిక్షమయ్య గౌడ్ చల్లా వెంకట్రామిరెడ్డి తుమ్మల నాగేశ్వర్ రావు చాడ కిషన్ రెడ్డి చింత వేంకటేశ్వర్ రెడ్డివేముల వీరేశం మోత్కుపల్లి నరసింహులు కర్నె ప్రభాకర్ రాపోలు ఆనంద్ భాస్కర్ జూపల్లి కృష్ణారెడ్డి వేనెపల్లి చందర్ రావు తేరా చిన్నప్పరెడ్డి చకిలం అనిల్ కుమార్ లు ప్రత్యేకంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు పారిశ్రామిక వేత్తలు ఇతరులు ఈ స్థానాల కోసం పోటీ పడుతున్నారు.