MLC Kavitha: నిజామాబాద్ లోక్‌సభ బరిలో కల్వకుంట్ల కవిత, అర్వింద్ కు సవాల్

వచ్చే ఎన్నికల్లో ఎక్కడ్నుంచి పోటీ చేస్తారనే విషయమై కల్వకుంట్ల కవిత క్లారిటీ ఇచ్చారు.

Published By: HashtagU Telugu Desk
Mlc Kavitha, chandrababu

Mlc Kavitha

2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తానని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కె.కవిత ప్రకటించారు. అసెంబ్లీలోని బీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడుతూ.. పదేళ్లలో నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం అభివృద్ధిలో బీజేపీ పాత్ర లేదని అన్నారు.

ప్రస్తుత ఎంపీ ధర్మపురి అరవింద్‌ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా ఓడిస్తానని ఆమె చెప్పారు. నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌కు నిజామాబాద్‌ ఐటీ హబ్‌ కార్యకలాపాలపై అవగాహన లేదు. నిజామాబాద్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తుంటే బీజేపీ నేతలు మాత్రం అసత్య ప్రచారానికి పూనుకున్నారు’’ అని కవిత మండిపడ్డారు. తెలంగాణలో నిరంతర విద్యుత్ సరఫరాపై అవహేళన చేస్తున్న బీజేపీ ఎంపీ బండి సంజయ్‌కు ఎమ్మెల్సీ సవాల్ విసిరారు. నిజామాబాద్‌లో నూతనంగా ప్రారంభించిన ఐటీ హబ్‌తో స్థానిక యువతకు కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయని టీఎస్‌ఆర్‌టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యే గణేష్ బిగాల అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ ను విమర్శించే ముందు సంక్షేమ పథకాల గురించి తెలుసుకొని మాట్లాడాలన్నారు.

నిజామాబాద్ ఎంపీ ఏదో ర‌క‌ర‌కాలుగా మాట్లాడుతున్నారని క‌విత ధ్వ‌జ‌మెత్తారు. ఏమైంది నువ్వెక్క‌డ పోటీ చేస్తావు.. నేనేక్క‌డ పోటీ చేస్తా అని మాట్లాడుతున్నారు. ఎంపీ అర‌వింద్‌కు ఒక అల‌వాటు ఉంది. నిజామాబాద్ పార్ల‌మెంట్ ప‌రిధిలో ఏడు సెగ్మెంట్లు ఉంటే.. ప్ర‌తి సెగ్మెంట్‌లో వారి పార్టీలో ముగ్గురిని మొద‌లుపెడుతాడు. అంద‌రితో పైస‌లు ఖ‌ర్చు పెట్టిస్త‌డు. నీకు టికెట్ అంటే నీకు టికెట్ అంటే అని చెప్పి అంద‌ర్నీ ముంచుత‌డు. మొన్న వాళ్లంద‌రూ క‌లిసిపోయి ఆయ‌న ఆఫీసులో దాడి చేశారు. ఒక ప‌క్క ప్ర‌జ‌లను మోసం చేయ‌డం.. ఇంకోప‌క్క సొంత పార్టీ నాయ‌కుల‌ను మోసం చేయ‌డం ఆయ‌న‌కు అల‌వాటుగా మారింద‌ని క‌విత విమ‌ర్శించారు.

Also Read: Amala Paul: పాల్.. పాల్.. అమలాపాల్.. బికినీ షో తో గ్లామర్ హద్దులు చేరిపేస్తున్న బ్యూటీ

  Last Updated: 11 Aug 2023, 01:39 PM IST