Site icon HashtagU Telugu

Kavitha: మాది భయపడే రక్తం కాదు.. భయపెట్టే రక్తం: ఎమ్మెల్సీ కవిత

Brs Mlc Kavitha Sensational

Brs Mlc Kavitha Sensational

అనేక ఇబ్బందులు, కష్టాలు ఎదురైనా పిడికిలి ఎత్తి అన్ని ఎదురించి వచ్చాను. నేను నిప్పులాంటి నిజామాబాద్ బిడ్డను… దేనికీ భయపడను. కేసీఆర్ ఎదుర్కొనే ధైర్యం, దమ్ములేక నాపై, కేటీఆర్ పై అక్రమ కేసులు పెట్టారు. మాది భయపడే రక్తం కాదు.. భయపెట్టే రక్తం. మేము తప్పు చేయలేదు… భయపడే ప్రసక్తే లేదు. ఎన్ని కేసులు పెట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలు నిప్పు కణికల్లా బయటికి వస్తారు. కేంద్రాన్ని ఎదురించి ప్రశ్నిస్తే బీజేపీ కేసులు పెడుతోంది. రాష్ట్రంలో అక్రమ కేసులపై గురించి చెప్పనవసరం లేదు. పేరు మర్పిపోయినా, రైతులు భూములు ఇవ్వకపోయినా కేసులు పెడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వానికి ఎందుకింత భయం ?

బరువు ఎత్తుకున్నోడు ఓపికతో ఉండాలి. ప్రజల ఇబ్బందులను పరిష్కరించడానికే అధికారం ఇచ్చారన్న విషయాన్ని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మరిచిపోయాయి. పోరాటం చేసి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వాళ్లం .. .గట్టిగా నిలబడుతాం.. ప్రజల పక్షనా పోరాటం చేస్తాం. డిగ్రీ చదువుకున్న ఆడపిల్లలకు స్కూటీల పంపిణీ ఏమైంది ? మహిళలకు నెలకు రూ. 2500, కళ్యాణ లక్ష్మీ కింద తులం బంగారం ఇవ్వలేదు. మైనారిటీలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కాంగ్రెస్ సర్కార్ అమలు చేయలేదు. బీరాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటి వరకు పెన్షన్లు మొత్తాన్ని పెంచలేదు. మనం ఊరుకుంటే ప్రభుత్వం కదలదు, ప్రతీ ఒక్కరు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. గ్రామ గ్రామాన కాంగ్రెస్ నాయకులను నిలదీయాలి. విద్యార్థులు, రైతులు, మహిళలను, ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. పీపుల్స్ ఫ్రెండ్లీ పోలిసింగ్ పోయి, రాష్ట్రంలో కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ నడుస్తోంది. రాష్ట్రంలో పోలీసు జులుం నడుస్తున్నది. కేసీఆర్ ప్రవేశపెట్టిన మంచి పనులను ప్రభుత్వం కొనసాగించాలి.

రాబోయేది గులాబీ జెండా శకమే, అందులో సందేహమే లేదు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానే. ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసాపై ప్రభుత్వం మాట్లాడడం లేదు. గురుకులాలను పడడానికి కూడా ప్రభుత్వానికి చేతకావడం లేదు. ఇప్పటికే 57 మంది పిల్లలను పొట్టనపెట్టుకున్నారు.. ఇంకెంత మందిని పొట్టనపెట్టుకుంటారు ? ఉద్యోగాల పేరిట సీఎం రేవంత్ రెడ్డి యువతను తప్పదోవ పట్టిస్తున్నారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటి వరకు కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకే ఉద్యోగాలు ఇస్తున్నారు. అటో కార్మికులకు ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు, మహిళలక ఉచిత బస్సు అని చెప్పి బస్సుల సంఖ్య తగ్గించారు. సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు శిష్యుడు, తెలంగాణ తల్లి స్థానంలో కాంగ్రెస్ మాతను ఏర్పాటు చేశారు. మన తెలంగాణ తల్లి మనకు కావాలి …తెలంగాణ తల్లి మాదిరా… కాంగ్రెస్ తల్లి మీదిరా…మన పొట్టమీదనే కాదు… మన సంస్కృతిపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దాడి చేస్తున్నది. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నిర్భందాలకు పాల్పడినా భయపడే ప్రసక్తే లేదు. మళ్లొకసారి నిజామాబాద్ పవర్ ను సీఎం రేవంత్ రెడ్డికి రుచి చూపిద్దాం అంటూ కవిత కీలక వ్యాఖ్యలు చేసారు.

Read Also : Pawan Daughter Aadhya : పవన్ కళ్యాణ్ కూతురు ఆటో లో ప్రయాణించడం ఏంటి..?