Site icon HashtagU Telugu

Kavitha Audio Message: కవిత ఆడియో సందేశం.. ఆ అంశంపై కీలక వ్యాఖ్యలు

Brs Mlc Kavitha Audio Message Telangana Social Welfare Hostels Govt Hostels Congress

Kavitha Audio Message: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఒక ఆడియో క్లిప్‌ను విడుదల చేశారు. తెలంగాణలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో దారుణ పరిస్థితులు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. హాస్టళ్లలోని శానిటేషన్ వర్కర్లను తీసేసి, ఆ పనులను పిల్లలతో చేయించడం పెద్దనేరమని కవిత తెలిపారు. స్వీపింగ్, శానిటేషన్ కోసం ఒక్కో గురుకుల పాఠశాలకు ప్రతి నెలా బీఆర్ఎస్ ప్రభుత్వం రూ . 40,000 కేటాయించిందని ఆమె గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ హాస్టళ్లలో  నలుగురు తాత్కాలిక ఉద్యోగులు పనిచేసేవారని.. వారు టాయిలెట్లు, తరగతి గదులను శుభ్రం చేసేవారని కవిత  పేర్కొన్నారు. ‘‘గత సంవత్సరం(2024) ఆగస్టు నుంచి ఈ పద్ధతిని కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించింది. పిల్లలే టాయిలెట్లు, గదులు క్లీన్ చేసుకోవాలని అధికారులు చెప్పారు. ఇది దారుణం’’ అని ఆమె వ్యాఖ్యానించారు.

Also Read :High Court CJ : తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్‌ అపరేశ్‌‌ కుమార్‌ సింగ్‌.. మరో 3 హైకోర్టులకూ..

అసిస్టెంట్ కేర్ టేకర్‌లను తొలగించడం సరికాదు

“తెలంగాణలోని 240 గురుకుల విద్యా సంస్థల్లో అసిస్టెంట్ కేర్ టేకర్ లను తొలగించి, వారు చేసే వార్డెన్ పనులను పిల్లలతో చేయించాలని చెబుతున్నారు. ఇప్పటి వరకు వార్డెన్లే నిర్వహణలు చూసుకున్నా, పిల్లలు కమిటీగా ఏర్పడి క్వాలిటీ చెక్ చేసుకునేవారు. ఇకపై పిల్లలే వంటశాల నిర్వహణ, మెస్ పనులు చేయాల్సి వస్తుంది. శ్రమను గౌరవించడం వేరు, దాన్ని నేర్పడం వేరు, విద్యార్థులతో వెట్టిచాకిరీ చేయించడం వేరు” అని కవిత ధ్వజమెత్తారు.

Also Read :BJP MP Laxman: ఖర్గేజీ నిజాలు తెలుసుకోండి.. ఇది నయా భారత్ : ఎంపీ లక్ష్మణ్

అది కుల వివక్ష, శ్రమ దోపిడీ మాత్రమే

“ఇక్కడ ఆడియోలో వర్షిని(ఎస్సీ గురుకులాల కార్యదర్శి) గారు చెప్పిన దాంట్లోనే సమాధానం ఉంది. బోర్డు తుడవడం,  టాయిలెట్ కడగడం ఒకటి కాదు. మేడం గారి పిల్లలు చదువుకునే చోట అందరూ వాడే టాయిలెట్లను వీరు క్లీన్ చేయగలరా ? అది కూడా రెగ్యులర్ గా ? సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్‌లో చదివే పిల్లలు ఏమైనా పాష్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చారా? వెళ్లి కూర్చోగానే టేబుల్‌పైకి ఫుడ్ రాదు అనడమేంటి ? ఎందుకు ఇలాంటి పనులు చేయరు ? చేయాల్సిందే అని ఒక ఐఏఎస్ అధికారి అనడం దుర్మార్గం. ఈ వివక్షల నుంచి తప్పించడానికే కదా ఈ పిల్లలకు సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఏర్పాటు చేయించి చదివించేది. ఇది డిగ్నిటీ ఆఫ్ లేబర్ నేర్పడం కాదు. కుల వివక్ష, శ్రమ దోపిడీ మాత్రమే” అని కవిత(Kavitha Audio Message) దుయ్యబట్టారు.‘‘ఒకవైపు ఉద్యోగాలు కల్పిస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్పడం, మరోవైపు అత్యవసరమైన చోట ఉద్యోగులను తొలగించి, ఆ పని భారం విద్యార్థుల మీద ఉంచడం తప్పు” అని ఆమె పేర్కొన్నారు.