Dharani : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అసెంబ్లీ ఆమోదించిన భూ భారతి బిల్లు పై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారములోకి వచ్చి ఏడాది అవుతుంది. అయిన ఇంకా అబద్ధాలు ఎందుకు ఉన్నది ఉన్నట్టు ప్రజలకు చెప్పండి. సాదాబైనామాలు, అబాదిలు, గ్రామ కంఠం భూముల పై మీద క్లారిటీ లేదు ఎదో కుట్ర కోణం ఉన్నట్టు కనిపిస్తుంది. ప్రజలు వెంటపడి ఈ చట్టాన్ని తొలగించుకుంటారు. ఇది భూభారతి కాదు.. భూ హారతి. బీఆర్ఎస్ అంటే భూ రక్షణ సమితి అని రైతులు మాకు కితాబిచ్చారు అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
ఎంజాయ్మెంట్ సర్వే అంటున్నారు. ఇప్పటికే రైతులు బేజారు అయితున్నారు. పచ్చగా ఉన్న రైతుల జీవితాలతో ఎందుకు అడ్డుకుంటున్నారు. ధరణిలో పార్ట్ (ఏ) లో కొన్ని భూములు, పార్ట్ (బి) లో కొన్ని భూములు రూపొందించారూ. భూదార్ అంటున్నారు. పాస్ బుక్ టాంపర్ కాకుండా చేసాము. ఖాతా నంబర్ ఉండగా మళ్ళీ భూదార్ ఎందుకు అని కవిత అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా భూమి అనేది ఒక ఎమోషన్. భూమి కోసం ప్రాణము ఇచ్చేవారు ఇద్దరు ఒకరు సైనికుడు, ఒకరు రైతు అని కవిత అన్నారు. తెలంగాణ లో 1942 లో మా భూమి మాకు కావాలని కొట్లాడారు.
కేసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన మార్క్ ఉండాలని ధరణి చట్టం తేలేదు. రైతు తన గుండెల మీద చేయి వేసుకొని హాయిగా నిద్రపోయేలా ధరణి తెచ్చారు. అలాంటి ధరణితో ఆటలాడుతున్నారు. చరిత్ర మిముల్ని క్షమించదు. మళ్ళీ రైతులు ధరణి కావాలని తిరగబడే రోజులు వస్తాయని అన్నారు. రైతులకు తమ భూమి గురించి సంపూర్ణ హక్కులు పూర్తి వివరాలు తెలుసుకునెలా ధరణి పోర్టల్ తెచ్చారు. ఎదో ఒక వ్యక్తి మీద, పార్టీ మీద కోపంతో కాకుండా ప్రజలకు ఏది మంచిదో ఆలోచిస్తే బాగుంటుంది. భూ భారతి చట్టం తేవడం రాష్ట్రం తిరోగమన చర్యలా ఉందని కవిత అన్నారు.
కాగా, తెలంగాణ భూ భారతి – 2024 బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి రానుంది. ఇప్పటి వరకు ఉన్న ధరణి స్థానంలో ఇకపై భూ భారతి రానుంది. అర్వోఆర్-2020ను కూడా పూర్తిగా ప్రక్షాళన చేస్తూ… కొత్త చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చింది. కొత్త చట్టంలో కీలక అంశాలు ఉన్నాయి.
Read Also: Ram Gopal Varma : రామ్‌గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ నోటీసులు