MLC Kavitha: సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ, కీలక అంశాలు ప్రస్తావన

  • Written By:
  • Updated On - February 25, 2024 / 05:57 PM IST

MLC Kavitha: ఢిలీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇటీవలనే ఆమెకు ఈడీ మరోమారు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కల్వకుంట్ల కవిత సీబీఐకి లేఖ రాశారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి లేదా ఉపసంహరించుకోండి అని రియాక్ట్ అయ్యింది. ఒకవేళ నా నుంచి సీబీఐకి ఏవైనా ప్రశ్నలకు సమాధానం, సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో హాజరవ్వడానికి అందుబాటులో ఉంటాను అని కవిత స్పష్టం చేశారు.

‘‘ముందే నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్న రీత్య ఈ నెల 26న విచారణకు హాజరుకావడం సాధ్యం కాదు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇవ్వడం సబబు కాదు. 2022 డిసెంబరులో అప్పటి ఐవో ఇదే తరహా నోటీసును సెక్షన్ 160 కింద ఇచ్చారు. గతంలో జారీ చేసిన సెక్షన్ 160 నోటీసుకు ప్రస్తుత సెక్షన్ 41ఏ నోటీసు పూర్తి విరుద్ధంగ ఉంది. సెక్షన్ 41ఏ కింద ఎందుకు, ఏ పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చారో స్పష్టత లేదు’’ కవిత అన్నారు.

‘‘నోటీసు జారీ చేసిన సందర్భం కూడా ఆలోచింపజేస్తున్నది. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నోటీసులు జారీ చేయడం అనేక ప్రశ్నలకు తావునిస్తోంది. నాకు ఎన్నికల ప్రచార బాధ్యతలు ఉన్నందున ఢిల్లీకి పిలవడం అనేది ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా అవరోధం కలిగిస్తుంది. ఇది నా ప్రజాస్వామిక, రాజ్యంగ హక్కులకు భంగం కలిగిస్తుంది. సీబీఐ చేస్తున్న ఆరోపణల్లో నా పాత్ర లేదు… పైగా కేసు కోర్టులో పెండింగ్ లో ఉంది. గతంలోనూ సీబీఐ బృందం హైదరాబాద్ లోని నా నివాసానికి వచ్చినప్పుడు విచారణకు సహకరించాను. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో నాకు మా పార్టీ కొన్ని బాధ్యతలు అప్పగించింది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో జారీ చేసిన నోటీసులను నిలిపివేతకు పరశీలించండి’’ అని కవిత లేఖ లో పేర్కొన్నారు.